https://oktelugu.com/

‘ఎన్టీఆర్, పవన్, చరణ్’ రికార్డ్స్ పై బన్నీ కామెంట్స్ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సెన్సేషనల్ హిట్ అయి.. ఏకంగా నాన్ బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. కాగా నిన్నటితో ఈ సినిమా ఏడాది పూర్తి కావడంతో ఈ చిత్ర యూనిట్ వన్ ఇయర్ సెలెబ్రేషన్స్ ను గ్రాండ్ గా జరుపుకుంది. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. Also Read: హర్ష కాబోయే భార్య ఎవరో తెలుసా? నాలుగేళ్లు […]

Written By:
  • admin
  • , Updated On : January 12, 2021 / 12:05 PM IST
    Follow us on


    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సెన్సేషనల్ హిట్ అయి.. ఏకంగా నాన్ బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. కాగా నిన్నటితో ఈ సినిమా ఏడాది పూర్తి కావడంతో ఈ చిత్ర యూనిట్ వన్ ఇయర్ సెలెబ్రేషన్స్ ను గ్రాండ్ గా జరుపుకుంది. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

    Also Read: హర్ష కాబోయే భార్య ఎవరో తెలుసా? నాలుగేళ్లు డేటింగ్ అట !

    బన్నీ మాటల్లో ‘ప్రతి నటుడికి హీరోకి ఏదో ఒక సమయంలో ఆల్ టైమ్ రికార్డు పడుతుంది. పవన్ గారికి 7వ సినిమాతో అంటే ఖుషికి రికార్డు పడింది. ఎన్టీఆర్ కు కూడా ఏడవ సినిమాతోనే ఆల్ టైమ్ రికార్డ్ పడింది. చరణ్ కు రెండవ సినిమాతో రికార్డు పడింది. కానీ, నాకు మాత్రం ఆల్ టైమ్ రికార్డు పడటం లేదే అని ఎదురు చూస్తున్న సమయంలో ఈ సినిమా పడింది. వారికి చాలా త్వరగానే ఆల్ టైమ్ రికార్డు పడింది. కానీ నాకు మాత్రం 20 సినిమాల తర్వాత ఆల్ టైమ్ రికార్డు దక్కింది అని బన్నీ చెప్పుకొచ్చాడు. ఇంత ఓపెన్ గా మాట్లాడటం బహుశా బన్నీకే సాధ్యమేమో.

    Also Read: మొదటి రోజు అద్భుతం.. రేపు కలుద్దాం !

    అలాగే బన్నీ ఇంకా మాట్లాడుతూ.. తన ఫ్యాన్స్ కి మంచి కిక్ ను ఇచ్చాడు. ఇక నుండి తప్పకుండా నా సినిమాలు మరో లెవల్ లో ఉంటాయి, అంటూ అభిమానులకు బన్నీ హామీ ఇవ్వడంతో ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఇన్నేళ్ల బన్నీ కెరీర్ లో మ్యూజిక్ సెన్సేషన్ హిట్ ఇచ్చిన క్రెడిట్ మాత్రం థమన్ కే దక్కుతుంది. దేవితో బన్నీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నా.. తమన్ తో మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ దక్కింది. తన కెరీర్ లో అద్భుత పాటను అందించినందుకు థమన్ కు త్రివిక్రమ్ మరియు సింగర్ రోల్ రైడాకు కూడా స్పెషల్ థాంక్స్ ను తెలిపాడు బన్నీ.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్