https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ స్టైలే వేరు.. అప్పుడు బాడీగార్డ్.. ఇప్పుడు డిజిటల్ హెడ్

Allu Arjun: పెద్ద హీరోలకు ఉండే రేంజ్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద హీరోలకు ఉండే టీమ్ కూడా చాలా పెద్దదిగానే ఉంటుంది. బడా స్టార్లు బయటకు ఎక్కడకు వెళ్లినా అభిమానుల నుంచి వారికి ప్రొటెక్షన్ అందించడంలో వారి టీమ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాంటి టీమ్‌ను మన హీరోలు కూడా సొంత వ్యక్తుల్లా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేరే హీరోల సంగతేమో కానీ అల్లు అర్జున్ మాత్రం తమ టీమ్‌లోని సభ్యులను ప్రేమగా చూసుకుంటూ […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 19, 2022 / 12:01 PM IST
    Follow us on

    Allu Arjun: పెద్ద హీరోలకు ఉండే రేంజ్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద హీరోలకు ఉండే టీమ్ కూడా చాలా పెద్దదిగానే ఉంటుంది. బడా స్టార్లు బయటకు ఎక్కడకు వెళ్లినా అభిమానుల నుంచి వారికి ప్రొటెక్షన్ అందించడంలో వారి టీమ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాంటి టీమ్‌ను మన హీరోలు కూడా సొంత వ్యక్తుల్లా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేరే హీరోల సంగతేమో కానీ అల్లు అర్జున్ మాత్రం తమ టీమ్‌లోని సభ్యులను ప్రేమగా చూసుకుంటూ ఇటీవల సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాడు.

    Allu Arjun

    తన టీమ్‌లోని సభ్యులకు సంబంధించి ఏ వేడుక జరిగినా అందులో అల్లు అర్జున్ భాగస్వామ్యం అవుతున్నాడు. తన టీమ్ సభ్యుల పుట్టినరోజు అయినా పెళ్లిరోజు అయినా వాటికి హాజరవుతూ ప్రేమగా పలకరిస్తున్నాడు. ఐకాన్ స్టార్‌లోని ఈ గుణమే అతడిని ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇటీవల తన బాడీగార్డ్ పుట్టిన రోజును ఘనంగా జరిపిన బన్నీ.. ఇప్పుడు డిజిటల్ హెడ్ శరత్ చంద్ర పుట్టినరోజు వేడుకల్లో ముఖ్య అతిథిగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు.

    Also Read: Puri Jagannadh: అప్పట్లో ‘పూరి’ సినిమాలను రిజెక్ట్ చేసిన హీరో.. ఇప్పుడు ఒక్క హిట్ లేదు..

    తన టీమ్‌లోని కంటెంట్, డిజిటల్ హెడ్ శరత్ చంద్ర నాయుడు పుట్టిన రోజు వేడుకలను అల్లు అర్జున్ ఘనంగా జరిపాడు. శరత్ చంద్రతో దిగిన ఫోటోలను తాజాగా బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. గతేడాది కూడా శరత్ పుట్టిన రోజు వేడుకలను అల్లు అర్జున్ ఘనంగానే జరిపాడు. అప్పుడు కూడా ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.

    Allu Arjun

    మరోవైపు ఇటీవల తమ టీమ్‌లోని పీఆర్ ఏలూరు శ్రీను పెళ్లి జరిగితే దానికి కూడా అల్లు అర్జున్ ప్రత్యేకంగా హాజరయ్యాడు. అంతేకాకుండా తన సినిమాలకు పనిచేసిన సభ్యులకు కూడా బన్నీ స్పెషల్ సర్‌ప్రైజ్‌లు అందజేస్తుంటాడు. కాగా ఇలాంటి బాస్ దొరకడం నిజంగా తమ అదృష్టమని బన్నీ టీమ్‌లోని సభ్యులందరూ భావిస్తున్నారు. ఆయన తమను చాలా స్పెషల్‌గా చూసుకుంటారని ప్రశంసలు కురిపిస్తున్నారు.

    Also Read: Radhe Shyam Collection: రాధేశ్యామ్ విష‌యంలో జ‌ర‌గ‌ని పుష్ప త‌ర‌హా మ్యాజిక్‌.. డిజాస్ట‌ర్ టాక్ క‌న్ఫ‌ర్మ్‌..!

    Tags