Allu Arjun Filmfare Awards Record: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన రికార్డు ని నెలకొల్పిన హీరో గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. రికార్డ్స్ లోనే కాదు, అవార్డ్స్ లో కూడా టాలీవుడ్ లో ప్రస్తుతానికి తన తర్వాతే ఎవరైనా అని మరోసారి నిరూపించుకున్నాడు. నిన్న ఆయన ‘పుష్ప 2’ చిత్రం లో అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గానూ ‘ఉత్తమ నటుడు’ క్యాటగిరీలో ఫిలిం ఫేర్ అవార్డుని అందుకున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 7 వ ఫిలిం ఫేర్ అవార్డు. మన టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ మెగాస్టార్ చిరంజీవి కి మాత్రమే 7 ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఉన్నాయి. ఆయన దరిదాపుల్లోకి మరో హీరో ఇంతకుముందు వరకు రాలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఆయనతో సమానంగా 7 ఫిలిం ఫేర్ అవార్డ్స్ ని అందుకున్నాడు. రాబోయే రోజుల్లో చిరంజీవి రికార్డు ని కూడా దాటేస్తాడని అంటున్నారు విశ్లేషకులు.
‘పుష్ప 2’ చిత్రానికి ముందు అల్లు అర్జున్ కి పరుగు, రుద్రమ దేవి, వేదం, రేసు గుర్రం, సరైనోడు, పుష్ప వంటి చిత్రాలకు అవార్డులను అందుకున్నాడు. ఇందులో కేవలం రుద్రమ దేవి చిత్రానికి ఒక్కటే ‘ఉత్తమ సహాయ నటుడు’ క్యాటగిరిలో అందుకున్నాడు. ఇలా నేటి తరం హీరోలలో అరుదైన రికార్డు ని నెలకొల్పిన అల్లు అర్జున్ ని చూసి ఆయన అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. ఏ హీరో కూడా అల్లు అర్జున్ కి ఈ విషయం లో దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం. పవన్ కళ్యాణ్ కి ఒకటి, మహేష్ బాబు కి నాలుగు, రామ్ చరణ్ కి మూడు , ఎన్టీఆర్ కి రెండు ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఉన్నాయి. ఇక ప్రభాస్ కి అయితే ఇప్పటి వరకు ఒక్క ఫిలిం ఫేర్ అవార్డు కూడా దక్కకపోవడం గమనార్హం. రామ్ చరణ్ అందరికంటే తక్కువ సినిమాలు చేసాడు కాబట్టి కేవలం మూడే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆయన కచ్చితంగా అల్లు అర్జున్ ని దాటేస్తాడని ఆయన అభిమానులు బలమైన నమ్మకం తో చెప్తున్నారు.