Allu Arjun Atlee Movie Update: మన టాలీవుడ్ లో వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టగలిగే సత్తా ఉన్న కాంబినేషన్స్ లో ఒకటి అల్లు అర్జున్ – అట్లీ మూవీ. ఈ సినిమా ప్రకటనే ఒక సెన్సేషన్. ఒక టీజర్ విడుదల చేస్తే ఎంతటి రీచ్ వస్తుందో, ఈ సినిమా ప్రకటన వీడియో కి అంతకంటే ఎక్కువ రీచ్ వచ్చింది. అసలు వీళ్ళు తీస్తున్నది టాలీవుడ్ సినిమానా?, లేదా హాలీవుడ్ సినిమానా అనే అనుమానం అందరిలోనూ కలిగింది. ఆ రేంజ్ స్టాండర్డ్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం అని ఒక సంకేతం ఇచ్చారు. ఇక ఈ చిత్రం లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించబోతుంది అని మరో ప్రకటన వీడియో రావడం, ఆ తర్వాత ఇందులో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ లు కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు అనే అప్డేట్ రావడం, రష్మిక విలన్ క్యారక్టర్ లో కనిపించబోతోంది అనే వార్త రావడం, ఇలా అన్నీ ఈ సినిమా పై అంచనాలు భారీగా పెంచేలా చేశాయి.
Also Read: 150 కోట్ల తో యాడ్ ఫిలిం చేసిన తమిళ్ స్టార్ డైరెక్టర్… ఎందుకింత ఖర్చు..?
అయితే ఈమధ్య కాలం లో యూనివర్స్ ట్రెండ్ కొనసాగుతుంది. అంటే ఒక డైరెక్టర్ సినిమాకు, తన గత సినిమాకు మధ్య లింక్ పెట్టడం. లోకేష్ కనకరాజ్ నుండి ఈ ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు ఈ చిత్రం కూడా అలా యూనివర్స్ జానర్ లో తెరకెక్కించబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యూనివర్స్ గా తెరకెక్కించాలని అనుకుంటే, ఈ చిత్రానికి జవాన్ తో లింక్ పెడుతారా?, ఎందుకంటే జవాన్ బాలీవుడ్ లో వెయ్యి కోట్ల గ్రాస్ ని రాబట్టిన సినిమా. ఆ చిత్రానికి లింక్ పెడితే ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి అట్లీ యూనివర్స్ ఎలా ఉండబోతోంది అనేది. ఇదంతా పక్కన పెడితే అట్లీ ప్రతీ సినిమాలోనూ హీరో డ్యూయల్ రోల్ లో కనిపిస్తూ వస్తున్నాడు.
ఆయన చివరి మూడు చిత్రాలు జవాన్, బిగిల్, మెర్సల్ వంటి చిత్రాల్లో హీరో డ్యూయల్ రోల్ లో కనిపించాడు. ఈ చిత్రం లో కూడా అల్లు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని టాక్. కొంతమంది అయితే ట్రిపుల్ రోల్ లో కూడా కనిపించబోతున్నాడు అని అంటున్నారు. ఇందులో ఒక అల్లు అర్జున్ క్యారక్టర్ పూర్తిగా నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందట. ఇలా ఈ చిత్రానికి సంబంధించి రోజుకో అప్డేట్ సోషల్ మీడియా లో లీక్ అవుతూ అభిమానుల్లో మరింత ఉత్కంఠ ని కల్పిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. అయితే థీమ్ ఒకే విధంగా ఉండొచ్చేమో కానీ, ఈసారి జానర్ మోత పూర్తిగా మార్చేశాడు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ఎంతటి అంచనాలను క్రియేట్ చేసుకోబోతుందో చూడాలి మరి.