Bunny Vasu: అంతర్జాతీయ ప్రమాణాలతో పాన్ వరల్డ్ చిత్రం గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) 22 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ సోషల్ మీడియా లో లీక్ అయినా అభిమానులు మరియు మూవీ లవర్స్ మెంటలెక్కిపోతున్నారు. సినిమా నుండి ముఖ్యమైన కంటెంట్ ఇప్పటి వరకు ఏది విడుదల అవ్వలేదు. కేవలం షూటింగ్ కి అల్లు అర్జున్, దీపికా పదుకొనే సిద్ధం అవుతున్న వీడియోలను మాత్రమే విడుదల చేశారు. ఈ వీడియోలే ఈ సినిమాపై ఇంతటి క్రేజ్ ని ఏర్పాటు అయ్యేలా చేసింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వాళ్లకు ఇదే మొదటి తెలుగు చిత్రం. గీత ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంది.
Also Read: ఓజీ లో స్పెషల్ క్యామియో రోల్ చేస్తున్న మహేష్ బాబు?
ఇప్పుడు గీతా ఆర్ట్స్ వ్యవహారాలు మొత్తం బన్నీ వాసు(Bunny Vas) చూసుకుంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఆయన కన్యాకుమారి అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన బన్నీ వాసు ని రిపోర్టర్స్ పలు అల్లు అర్జున్, అట్లీ మూవీ కి సంబంధించిన అప్డేట్ ని అడిగారు. దానికి బన్నీ వాసు సమాధానం చెప్తూ ‘ఆ సినిమా మా చేతుల్లో లేదు. అప్డేట్ ఇస్తే సన్ పిక్చర్స్ మాత్రమే ఇవ్వాలి, మాకు ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చేందుకు ఎలాంటి అధికారం లేదు. షూటింగ్ మొదలయ్యే ముందే వాళ్ళు మాతో నాన్ దిస్ క్లోజర్ అగ్రిమెంట్ జరిగింది. సినీ కార్మికుల బంద్ కారణం గా వారం రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మేము విదేశాల నుండి కొంతమంది టెక్నీషియన్స్ ని తీసుకొచ్చాము. వాళ్ళు ఈ వారం రోజులు ఖాళీగా కూర్చుకోవాల్సి వచ్చింది. రోజుకు కోటి 65 లక్షల రూపాయిల నష్టం వాటిల్లింది మాకు. ఇప్పుడు షూటింగ్ మొదలైంది. ఎలాంటి అంతరాయం లేకుండా జెట్ స్పీడ్ లో దూసుకెళ్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ వాసు.
ఇక ఈ సినిమా విశేషాల గురించి వస్తే, ఇది ఒక సూపర్ హీరో జానర్ లో తెరకెక్కుతున్న సినిమా అని అనుకోవచ్చు. అల్లు అర్జున్ ఇందులో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. దీపికా పదుకొనే , మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి వారు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం లో రష్మిక మందాన విలన్ గా నటిస్తుంది. అల్లు అర్జున్ పోషిస్తున్న మూడు క్యారెక్టర్స్ లో కూడా ఒక క్యారక్టర్ పూర్తి స్థాయి నెగటివ్ షేడ్స్ లో ఉంటుందట. మన తెలుగు నేటివిటీ ఎక్కడా తగ్గకుండా హాలీవుడ్ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ చిత్రంతో అల్లు అర్జున్ పాన్ వరల్డ్ స్టార్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
