Allu Arjun Atlee film shooting : అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అట్లీ(Atlee) తో ఒక సైన్స్ ఫిక్షన్ జానర్ లో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా ప్రకటించారు. ఈ చిత్రం లో బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకొనే(Deepika Padukone) కూడా భాగం కానుంది. ఆమెకు సంబంధించిన వీడియో ని కూడా రీసెంట్ గానే విడుదల చేసారు. నేడు ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చాలా సైలెంట్ గా పూర్తి అయ్యినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ తో పాటు మూవీ టీం మొత్తం ఈ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుందట. ఈ మొదటి షెడ్యూల్ పది రోజుల పాటు సాగుతుందని, ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ పై ఒక యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది.
రెండు వేర్వేరు ప్రపంచాలకు చెందిన అన్నదమ్ముల స్టోరీ గా ఈ సినిమా తెరకెక్కుతుందట. ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ లో కనిపించనున్నాడు. ఒక క్యారక్టర్ పాజిటివ్, ఒక క్యారక్టర్ నెగటివ్,మరో క్యారక్టర్ యానిమేటెడ్ గా ఉంటుందని సమాచారం. మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యాక ఒక టీజర్ కట్ ని కూడా రెడీ చేసే పనిలో ఉన్నాడట డైరెక్టర్ అట్లీ. ఈ టీజర్ ని ఆగష్టు 15 న విడుదల చేయబోతున్నారట. మొదటి షెడ్యూల్ పూర్తి అవ్వగానే ఈ టీజర్ కి సంబంధించిన అప్డేట్ ని ఇవ్వబోతున్నారు మేకర్స్. ‘సన్ పిక్చర్స్’ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పాన్ వరల్డ్ చిత్రాన్ని నిర్మిస్తుంది. సుమారుగా 800 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఈ చిత్రం కోసం ఖర్చు చేయబోతున్నారు. మహేష్ బాబు, రాజమౌళి చిత్రానికి కూడా అంత బడ్జెట్ అవ్వలేదట.
Also Read : అల్లు అర్జున్, అట్లీ మూవీ గురించి సంచలన అప్డేట్..ఫ్యాన్స్ కి పండగే!
ఈ కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు ఇండియా లోనే కాదు, హాలీవుడ్ లో కూడా సినిమా తెరకెక్కలేదు. అనుకున్నది అనుకున్నట్టు గా తీసి, VFX వర్క్ విషయం లో మ్యాజిక్ క్రియేట్ చేయగలిగితే ఈ సినిమా సృష్టించే అద్భుతాలను ఊహించడం ఎవరి తరం కూడా కాదని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ఈ సినిమాలో మొత్తం 5 మంది హీరోయిన్లు ఉంటారట. వారిలో ఇప్పటికే దీపికా పదుకొనే పేరుని అధికారికంగా ప్రకటించారు. మృణాల్ ఠాకూర్,జాన్వీ కపూర్ పేర్లు కూడా ఖరారు అయ్యాయట. త్వరలోనే వీళ్ళ పేర్లను కూడా స్పెషల్ వీడియోస్ తో అధికారికంగా ప్రకటించనున్నారు. మిగిలిన ఇద్దరు హీరోయిన్ల గురించి త్వరలోనే తెలియనుంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రంలో వివిధ భాషలకు చెందిన సూపర్ స్టార్స్ కూడా భాగం కాబోతున్నారని, అట్లీ ఈ ప్రాజెక్ట్ కోసం తన సర్వస్వం పెట్టి పనిచేస్తున్నదని అంటున్నారు. చూడాలి మరి అల్లు అర్జున్ ఈ చిత్రం తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడు అనేది.