Allu Arjun – Atlee Unexpected surprise : అల్లు అర్జున్(Icon Star Allu Arjun),అట్లీ(Atlee Movie) మూవీ గురించి రోజుకో అప్డేట్ సోషల్ మీడియా లీక్ అవుతూ అభిమానుల్లో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెంచుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ వీడియో ని అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు విడుదల చేసి ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇలాంటి సర్ప్రైజ్ లు సినిమాలో బోలెడన్ని ఉంటాయట. ముందుగా అల్లు అర్జున్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడంటూ టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన డ్యూయల్ రోల్ కాదు ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని, 5 మంది హీరోయిన్లు ఇందులో నటిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఎంపిక అయ్యారు. మరో ఇద్దరు హీరోయిన్ రోల్స్ కోసం వెతుకుతున్నారు. ఒక సినిమాలో ఇంత మంది హీరోయిన్స్ ఎందుకు అనేది కూడా సర్ప్రైజ్ ఎలిమెంట్ గా ఉంచబోతున్నారు మేకర్స్.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇందులో ఆయన 5 నిమిషాల నిడివి ఉన్న అతిథి క్యారక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కథని ఊహించని మలుపు తిప్పే పాత్రలో మెగాస్టార్ తళుక్కుమని మెరుస్తాడట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. గతం లో మెగాస్టార్ చిరంజీవి,అల్లు అర్జున్ కలిసి ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రం లోని ఒక పాటలో కనిపించారు. అంతకు ముందు చిరంజీవి హీరో గా నటించిన ‘డాడీ’ చిత్రం లో కూడా అల్లు అర్జున్ ఒక చిన్న పాత్ర ద్వారా కనిపిస్తాడు. ఇలా రెండు సార్లు మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మూడవసారి కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఇలా మామా అల్లుడిని ఒకే స్క్రీన్ మీద చూస్తే అభిమానులకు ఏ రేంజ్ ఉత్సాహం కలుగుతుందో మాటల్లో చెప్పడం కష్టమే.
Also Read : అల్లు అర్జున్, అట్లీ మూవీ గురించి సంచలన అప్డేట్..ఫ్యాన్స్ కి పండగే!
అల్లు అర్జున్ హీరో గా మామూలు స్థాయిలో ఉన్నప్పుడు చిరంజీవి తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ స్థాయిలో ఉన్నప్పుడు. ఇప్పుడు మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో స్పెషల్. తానూ ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం మా మామయ్య మెగాస్టార్ చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకోవడం వల్లే అని ఇప్పటికీ చెప్తూనే ఉంటాడు అల్లు అర్జున్. ఒక మెగాస్టార్ గా కాకుండా ఒక వ్యక్తిగా ఆయన్ని నేను ఎంతగానో అభిమానిస్తానని, తన పిల్లలతో సమానంగా మమ్మల్ని కూడా చిన్నతనం లో చూసుకునేవాడని అల్లు అర్జున్ కొన్ని ఇంటర్వ్యూస్ చెప్పుకొని ఎమోషనల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. దురదృష్టం ఏమిటంటే వీళ్లిద్దరు కలిసి కనిపించిన రెండు సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి. కనీసం అట్లీ తో చేయబోయే సినిమా అయినా ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.