Allu Arjun And Atlee Movie Story: ‘పుష్ప 2’ వంటి భారీ కమర్షియల్ హిట్ తర్వాత అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తమిళ డైరెక్టర్ అట్లీ(Atlee) తో కలిసి చేస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వచ్చినప్పుడు సోషల్ మీడియా ఏ రేంజ్ లో బ్లాస్ట్ అయ్యిందో మనమంతా చూసాము. అల్లు అర్జున్ కి సంబంధించిన వీడియో, అదే విధంగా దీపికా పదుకొనే వీడియో లను విడుదల చేసినప్పుడు టీజర్స్ విడుదలైతే ఎంతటి రెస్పాన్స్ వస్తుందో, ఆ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని ఇన్ని రోజులు మనమంతా వింటూ వచ్చాము. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే ఇందులో ఆయన డ్యూయల్ రోల్ కాదు, ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నాడట. డైరెక్టర్ అట్లీ ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఎప్పుడూ చూడని వెండితెర దృశ్యకావ్యాన్ని చూపించబోతున్నాడట.
ఇన్ని రోజులు ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతుందా?, లేదంటే సూపర్ హీరో జానర్ లో తెరకెక్కుతుందా అనే విషయం పై ఫ్యాన్స్ లో క్లారిటీ ఉండేది కాదు. కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఇది ఒక సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కుతున్న సినిమా అని తెలుస్తోంది. మూడు లోకాలు ఉంటాయట, ఆ మూడు లోకాలకు సంబంధించిన వాళ్ళ మధ్య జరిగే స్టోరీ అట. కాస్త కొత్త రకమైన కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. అల్లు అర్జున్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరు లోపు పూర్తి చేయాలనీ దృఢమైన సంకల్పం తో మూవీ టీం పని చేస్తోందట. కానీ ఇంకో నెల రోజుల అదనపు సమయం కూడా అవసరం అవుతుందట. మే నెలాఖరు లోపు అల్లు అర్జున్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని టాక్.
ఈ సినిమా మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి, కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఏడాది సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయట. 2027 వ సంవత్సరం సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ చిత్రం లో దీపికా పదుకొనే తో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ లు కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వీళ్ళు కాకుండా ఒక కొత్త హీరోయిన్ ని కూడా ఈ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నారట. ఇక ఇందులో రష్మిక మందన్ విలన్ క్యారక్టర్ లో కనిపించబోతుంది టాక్. భారీ తారాగణం తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా 2000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు అభిమానులు.