Allu Aravindh : అల్లు అరవింద్ నిర్మాతగా సుమారు 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించిన ‘తండేల్’ చిత్రం మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్నటువంటి అంచనాలు సాధారణమైనవి కావు. ఈమధ్య కాలంలో యూత్ ఆడియన్స్ ఆడియో బంపర్ హిట్ అయితే సినిమాలకు బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ వసూళ్లు అందిస్తున్నారు. ‘తండేల్’ చిత్రానికి కూడా ఆడియో బాగా కలిసొచ్చింది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ‘కంగువా’ చిత్రం విడుదల తర్వాత ఇక దేవిశ్రీ ప్రసాద్ పని అయిపోయింది, ఆయన్ని దర్శక నిర్మాతలు తమ సినిమాలకు తీసుకోకుంటే బెటర్ అని అనుకుంటున్నా రోజుల్లో, ఈ చిత్రం ద్వారా దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన సత్తా చాటి చూపించాడు. విడుదలైన ప్రతీ పాట ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ వచ్చింది.
ముఖ్యంగా ‘బుజ్జి తల్లి’ పాటకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ ని ఎంచుకునే ముందు నిర్మాత అల్లు అరవింద్ అల్లు అర్జున్ తో జరిపిన సంభాషణని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకుందాం అని చందు అడిగితే నేను వద్దని చెప్పను. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు పుష్ప 2 చేస్తున్నాడు. సమయం మొత్తం మీకే కేటాయిస్తాడు, మా చిత్రంపై ద్రుష్టి పెట్టలేడనే ఉద్దేశ్యంతో వద్దని చెప్పాను. ఇక ఆ తర్వాత ఎవరిని తీసుకుందాం అని నాలో నేను గందరగోళానికి గురయ్యాను. ఒకరోజు డిన్నర్ లో కూర్చున్నప్పుడు బన్నీతో ఈ విషయం గురించి చర్చించాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మా సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకోమని డైరెక్టర్ చెప్తున్నాడు. కానీ అతని మీతో పని చేస్తున్నాడు. మీకు సమయంలో మ్యూజిక్ అందాలి, ఇతన్ని నాకు వదిలిపెట్టరని, వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోవాలని అనుకుంటున్నాను అని బన్నీ చెప్తే, వద్దు, దేవిశ్రీ ప్రసాద్ ని మాత్రమే తీసుకోండి. కేవలం అతను మాత్రమే లవ్ స్టోరీస్ కి న్యాయం చేయగలడు అని చెప్పాడు. ఒకసారి అడిగి చూద్దామని దేవిశ్రీ ని అడిగాను. ఆయన వెంటనే ఒప్పుకొని ఈ సినిమా చేసారు. ఒత్తిడి లో ఎక్కడ మా సినిమాకి మ్యూజిక్ అనుకున్న స్థాయిలో అందించలేడేమో అని భయపడ్డాను. కానీ అతని మ్యూజిక్ కారణంగానే ఈరోజు మా సినిమాకి ఇంత మంచి బిజినెస్ జరిగి, భారీ హైప్ ఏర్పడింది’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.