Allu Aravind: సినీ ఇండస్ట్రీ లో గత కొద్దిరోజుల నుండి జరుగుతున్న విషయాలను మనమంతా చూస్తూనే ఉన్నాం. థియేటర్స్ మూసి వేస్తున్నామంటూ బయ్యర్స్ నుండి వచ్చిన ఒక వార్నింగ్ పెద్ద ప్రకంపనలే రేపింది. ఈ వ్యవహారాలు స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి చిరాకు కలిగించింది. తన సినిమా విడుదల సమయం లో కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న చర్యగా ఆయన దీనిని భావించాడు. దీనిపై పవన్ ఫైర్ అవుతూ ప్రభుత్వం అంటే సినీ పెద్దలకు మర్యాద లేదంటూ ఆయన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఇక నుండి ప్రభుత్వం తో ఎలాంటి వ్యక్తిగత చర్చలు ఉండవని, ఏదైనా సంబంధిత సంఘాలతోనే చర్చలు ఉంటాయని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ అంశం పై నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) మాట్లాడుతూ ‘ గత కొద్దిరోజుల నుండి ఆ నలుగురు అని నన్ను కలుపుతూ మాట్లాడుతున్నారు. ఆ నలుగురిలో నేను లేను..కోవిద్ సమయంలోనే బయటకు వచ్చేసాను..తెలంగాణ లో ఒక్క థియేటర్ కూడా లేదు..1500 థియేటర్స్ లో కేవలం 15 థియేటర్స్ మాత్రమే ఉన్నాయి. మీడియా వాళ్ళు నన్ను కలపకండి.థియేటర్స్ మూసి వేస్తున్నారు అని వార్త వచ్చినప్పుడు కందుల దుర్గేష్ మాట్లాడినది నాకు చాలా సమంజసంగా అనిపించింది. ఇప్పటి వరకు ఈ అంశం పై మూడు సార్లు చర్చ జరిగితే నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు. మా వాళ్లకు కూడా వెళ్లొద్దు అని చెప్పాను. సింగిల్ థియేటర్స్ కొన్నాళ్ల నుండి ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవమే, ఆ సమస్య వచ్చినప్పుడు ఫిలిం ఛాంబర్ ఒకటి ఉంది, అందుకు గిల్డ్ కూడా ఉంది. వాళ్ళతో సమస్యల గురించి చర్చించి, ఆ చర్చలు విఫలమైతే 1వ తేదీ నుండి థియేటర్స్ మూసి వేస్తామని అన్నారు’.
‘ఏకపక్షంగా తీసుకునే ఇలాంటి నిర్ణయాలు సమంజసం కాదని నేను ఆ చర్చలకు వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్నప్పుడు, మేము థియేటర్స్ ని మూసేస్తాము అని చెప్పడం దుస్సాహసమే, ఇలాంటివి చెయ్యకూడదు. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లోకి వెళ్లి, ఉప ముఖ్యమంత్రి స్థానం లో కూర్చొని మనం ఏది కోరితే అది చేసిపెడుతున్న వ్యక్తి ఆయన. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పుడు మేమంతా అశ్విని దత్ గారి కల్కి చిత్రం విడుదల అవుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని వెళ్లి కలిసాము. టికెట్ రేట్స్ కాస్త పెంచమని అడిగాము. ఆయన మాకు చంద్రబాబు గారిని మీరంతా కలిసారా అని అడిగారు. ఒకసారి కలవండి అని మాకు చెప్పినప్పటికీ కూడా మా వాళ్ళు ఎవ్వరూ దానిని పట్టించుకోలేదు. నేను రెండు మూడు సార్లు ప్రయత్నం కూడా చేసాను. నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం, ప్రభుత్వానికి సంబంధం ఏముంది అనే అర్థం వచ్చేట్టు మాట్లాడారు. ప్రభుత్వానికి సంబంధమే లేకపోతే రెండు సంవత్సరాల క్రితం ఇండస్ట్రీ పెద్దలందరూ ఎందుకు అప్పటి ముఖ్యమంత్రి గారిని కలిశారు?. ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వం తో సంబంధం లేకుండా, వారి సహాయ సహకారాలు లేకుండా కష్టం’ అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు’.