Allu Aravind Megastar Controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇలాంటి సందర్భంలోనే ఇండియాలో ఆయనకు ఇప్పుడిప్పుడే చాలా మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతోంది. తన కెరీర్లో మొదటిసారి పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ‘ హరి హర వీరమల్లు’ సినిమా జులై 25వ తేదీన ప్రేక్షకుల ముందు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ ని సాధిస్తే పవన్ కళ్యాణ్ పేరు వైడ్ గా మరోసారి మారుమ్రోగిపోతోంది. ఇక ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా ఆయన చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. రాబోయే రోజుల్లో కూడా ఆయన గొప్ప పొలిటిషన్ గా మారబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ఆయన గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు. ఆయన డిప్యూటీ సీఎం అవ్వడం వల్ల సినిమాలు చేసేంత సమయం అయితే ఉండడం లేదు.
అందుకే సెట్స్ మీద ఉంచిన సినిమాలను ముందుగా కంప్లీట్ చేసి ఆ సినిమాలను అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన తొందరలోనే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…
Also Read: Allu Aravind: ఇండియన్ ఆర్మీ కి అల్లు అరవింద్ భారీ విరాళం..సెల్యూట్ చేస్తున్న నెటిజెన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఒక సినిమాలో మలయాళం మెగాస్టార్ అయిన మమ్ముట్టి (mammutty)ని తీసుకోవాలనే ప్రయత్నం చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు… త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) చేసిన జల్సా (Jalsa) సినిమాలో మమ్ముట్టిని విలన్ గా తీసుకోవాలని ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) ఆయన్ని అడిగారట.
దానికి మమ్ముట్టి కొంతవరకు కోపానికి కూడా వచ్చాడు అనే వార్తలైతే వచ్చాయి. ఏది ఏమైనా కూడా ఆ సినిమాలో ముఖేష్ ఋషి (Mukesh Rushi) విలన్ పాత్రను పోషించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నిజానికి మమ్ముట్టి కనక ఈ సినిమాలో విలన్ పాత్రను పోషించి ఉంటే ఈ సినిమా మీద ఇంకాస్త బజ్ అయితే క్రియేట్ అయ్యేది. అలాగే మలయాళం లో కూడా ఈ సినిమాకు ఎక్కువ ఆదరణ దక్కేదనే చెప్పాలి…