Thandel Pre Release Event: సినీ పరిశ్రమలో హిట్స్/ఫ్లాప్స్ సర్వసాధారణం. ప్రతీ ఒక్కరు బెస్ట్ ఔట్పుట్ ఇవ్వాలి, పెద్ద హిట్ కొట్టాలి అనే సినిమాలు తీస్తారు. కానీ కొన్నికొన్ని సార్లు టెక్నికల్ ఫెయిల్యూర్స్ వల్ల అవి ఫ్లాప్స్ అవుతుంటాయి. అప్పుడప్పుడు ఘోరమైన డిజాస్టర్స్ కూడా అవుతాయి. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, స్వర్గీయ ఎన్టీఆర్ లాంటి ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్స్ కే తప్పలేదు. ఇక నేటి తరం స్టార్ హీరోలు ఎంత చెప్పండి?..కానీ ఈ సంక్రాంతికి విడుదలైన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఫ్లాప్ అవ్వడం దురదృష్టకరం. #RRR వంటి సంచలన చిత్రం తర్వాత రామ్ చరణ్ మూడేళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి ఈ చిత్రాన్ని తీసాడు. నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ శంకర్ మీద అపారమైన నమ్మకం, గౌరవం తో మరో సినిమాకి కమిట్ అవ్వకుండా ఈ సినిమా మీదనే ఫోకస్ పెట్టాడు. కానీ చివరికి రామ్ చరణ్ కు అవమానాలే ఎదురయ్యాయి.
ఉదాహరణకు నిన్న రాత్రి హైదరాబాద్ లో ‘తండేల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి దిల్ రాజు కూడా ఒక అతిథి గా పాల్గొన్నాడు. అతను ప్రసంగం ఇచ్చే ముందు అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘దిల్ రాజు గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ సంక్రాంతికి ఒక సినిమాని ఇలా ఇచ్చి (చేతితో కిందకు చూపుతూ), ఇంకో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి(చేతిని పైకి చూపుతూ), మళ్ళీ ఇన్కమ్ టాక్స్ అధికారుల రైడింగ్స్, ఒక్క వారంలో చరిత్ర సృష్టించేశాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి దిల్ రాజు పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుతూ కనిపించాడు. అల్లు అరవింద్ గారు కేవలం దిల్ రాజు ని దృష్టిలో పెట్టుకొని ఎదో సరదాగా కామెంట్స్ చేసి ఉండొచ్చు, కానీ ఆ ఛాన్స్ ఇచ్చింది దిల్ రాజే కదా. ‘గేమ్ చేంజర్’ అనే చిత్రాన్ని నవ్వుల పాలు చేసింది కచ్చితంగా దిల్ రాజు టీం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ మీట్స్ లో పరోక్షంగా ఈవెంట్స్ కి వచ్చిన అతిథులు ‘గేమ్ చేంజర్’ పై పరోక్షంగా కామెంట్స్ చేస్తూ ఉండడం, దానికి దిల్ రాజు పగలబడి నవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక సినిమా థియేటర్స్ లో రన్నింగ్ లో ఉన్నప్పుడు ఫ్లాప్ అని చెప్పుకోవడం దురదృష్టకరం. ‘గేమ్ చేంజర్’ కి స్వయంగా నిర్మాతలే నెగటివ్ పబ్లిసిటీ చేసినట్టు అయ్యింది. హీరో పడిన కష్టానికి కనీస గౌరవం లేదు. ఈరోజు అల్లు అరవింద్ బహిరంగంగా సంక్రాంతి సినిమాల ఫలితాలపై వెటకారంగా కామెంట్స్ చేసే రేంజ్ కి వచ్చాడంటే, ఆ స్పేస్ ఇచ్చింది కచ్చితంగా దిల్ రాజే. ఒక్క డిజాస్టర్ ఫ్లాప్ సినిమాకి రామ్ చరణ్ ఇన్ని అవమానాలు ఎదురుకోవాల్సి వస్తుందని ఆయన అభిమానులు కలలో కూడా ఊహించి ఉండరు. రామ్ చరణ్ కి ఇలాంటివి కొత్తేమి కాదు, క్రిందపడడం, ఆ తర్వాత తనని చూసి వెక్కిరించే వాళ్లకు తన తదుపరి చిత్రాలతో మాడు పగిలేలా సమాధానం చెప్పడం అలవాటే. అన్ని కలిసి వస్తే ఈ ఏడాదే ఆయన సమాధానం చెప్పొచ్చు.
ఈ మధ్య చరిత్ర సృష్టించిన #DilRaju..
ఒక సినిమాని ఇలా ఇచ్చి ..ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి…మళ్ళీ income taxని invite chesi….
– #AlluAravind pic.twitter.com/cM2esYdpxU
— Gulte (@GulteOfficial) February 2, 2025