https://oktelugu.com/

బాలయ్య సినిమాలో అల్లరి నరేష్ ?

నట సింహం బాలయ్య బాబు కొత్త సినిమాలో అల్లరి నరేష్ నటించబోతున్నాడని.. ఇంటర్వెల్ లో కామెడీ పోలీస్ ఆఫీసర్ గా నరేష్ కనిపిస్తాడని.. కేవలం రెండు సీన్స్ లో మాత్రమే అల్లరి నరేష్ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే, ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. నిజానికి, ఈ సినిమాలో ఒక మూగ – చెమిటి పాత్ర ఉందని.. ఇది నలభై నిమషాల కీలక పాత్ర అని.. ఈ పాత్రలో క్రేజీ హీరో నాగశౌర్య […]

Written By: , Updated On : January 22, 2021 / 03:51 PM IST
Follow us on

Allari Naresh Balakrishna
నట సింహం బాలయ్య బాబు కొత్త సినిమాలో అల్లరి నరేష్ నటించబోతున్నాడని.. ఇంటర్వెల్ లో కామెడీ పోలీస్ ఆఫీసర్ గా నరేష్ కనిపిస్తాడని.. కేవలం రెండు సీన్స్ లో మాత్రమే అల్లరి నరేష్ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే, ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. నిజానికి, ఈ సినిమాలో ఒక మూగ – చెమిటి పాత్ర ఉందని.. ఇది నలభై నిమషాల కీలక పాత్ర అని.. ఈ పాత్రలో క్రేజీ హీరో నాగశౌర్య నటించబోతున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి, ఇప్పుడు అల్లరి నరేష్ పేరు లైన్ లోకి వచ్చింది.

Also Read: తన లేడీ బాస్ కి సూపర్ స్టార్ శుభాకాంక్షలు !

ఇక అందం, అభినయం అన్ని ఉన్నా.. అవకాశాల కోసం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉన్న టాల్ బ్యూటీ ప్రగ్య జైస్వాల్ కి మొత్తానికి ఈ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ‘కంచె’ సినిమాతో మొదట మంచి క్రేజ్ తో మొదలైన ప్రగ్య జర్నీ.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. ఇక అవకాశాలు రావడం కష్టమే అనుకున్న తరుణంలో బోయపాటి శ్రీను, ప్రగ్యకి మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. మొదట కొత్త హీరోయిన్ అనుకున్నా.. ఎందుకో బోయపాటి ప్రగ్య వైపే మొగ్గు చూపాడు. అలాగే మరో భామగా పూర్ణ నటిస్తోంది.

Also Read: టీజర్ టాక్ : 8 ప్యాక్‌తో అదరగొట్టిన ల‌క్ష్య !

కాగా ఎక్కువుగా గ్లామర్ రోల్స్ లో అలరించే ప్రగ్య ఈ సినిమాలో మాత్రం యంగ్ కలెక్టర్ పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది. “సర్రైనోడు” సినిమాలో క్యాథెరిన్ ని ఎమ్మెల్యేగా చూపించిన బోయపాటి, ఈ సినిమాలో ప్రగ్యని కలెక్టర్ గా చూపించబోతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ప్రగ్యా వచ్చే వారం నుండి షూట్ లో జాయిన్ అవ్వనుంది. ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించి, బాలయ్య ఫ్యాన్స్ కు ఫేవరేట్ డైరెక్టర్ అయిపోయాడు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్