https://oktelugu.com/

అయోధ్య రామమందిరానికి పవన్ ఎంత విరాళం ఇచ్చాడంటే?

పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీతో అంటకాగానే భక్తిని, హిందుత్వాన్ని ఓన్ చేసుకొని ముందుకెళుతున్నాడు. తాజాగా తిరుపతిలో పార్టీ రాజకీయ సభలకు హాజరైన పవన్ అంతకుముందు తిరుమల శ్రీవారిని కాలినడకన దర్శించుకొని పూజలు చేశారు. పంచె కట్టుకొని ఓ శాలువ కప్పుకొని కాషాయ వస్త్రధారణతో అలరించారు. Also Read: నిమ్మగడ్డతో ఫైట్.. సుప్రీంకోర్టులో జగన్ కు షాక్? కమ్యూనిస్టు భావాలు కలిగిన పవన్ ను ఈ వేషంలో చూసి అభిమానులు, జనసైనికులు కూడా కాస్త ఆశ్చర్యపోయారనే […]

Written By:
  • NARESH
  • , Updated On : January 22, 2021 / 03:54 PM IST
    Follow us on

    పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీతో అంటకాగానే భక్తిని, హిందుత్వాన్ని ఓన్ చేసుకొని ముందుకెళుతున్నాడు. తాజాగా తిరుపతిలో పార్టీ రాజకీయ సభలకు హాజరైన పవన్ అంతకుముందు తిరుమల శ్రీవారిని కాలినడకన దర్శించుకొని పూజలు చేశారు. పంచె కట్టుకొని ఓ శాలువ కప్పుకొని కాషాయ వస్త్రధారణతో అలరించారు.

    Also Read: నిమ్మగడ్డతో ఫైట్.. సుప్రీంకోర్టులో జగన్ కు షాక్?

    కమ్యూనిస్టు భావాలు కలిగిన పవన్ ను ఈ వేషంలో చూసి అభిమానులు, జనసైనికులు కూడా కాస్త ఆశ్చర్యపోయారనే చెప్పొచ్చు. అయితే పవన్ మాత్రం బీజేపీతో స్నేహంలో పూర్తిగా ఆ పార్టీ భావజాలంతోనే ముందుకెళుతున్నాడు.

    తాజాగా అయోధ్య రామ మందిరానికి పవన్ కళ్యాణ్ తన వంతుగా విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో విపత్తులకు అందరికంటే ముందు సాయం చేసే పవన్ కళ్యాన్ ఇప్పుడు రామ మందిరానికి కూడా తెలుగు రాష్ట్రాల్లోనే సాయం ప్రకటించిన మొదటి టాలీవుడ్ హీరోతోపాటు.. మొదటి బీజేపీయేతర రాజకీయ నాయకుడిగా నిలిచాడు.

    Also Read: అభ్యర్థి ఎవరైనా సపోర్టు చేయాలంట..!

    అయోధ్య శ్రీరామాలయ ట్రస్ట్‌కు రూ .30 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్టు తాజాగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రామ్ మందిరాన్ని నిర్మించడానికి దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారని పవన్ అన్నారు. ఇది తన విరాళం అని ఆయన అన్నారు. పవన్ సహచరులు .. జనసేన పార్టీ నాయకులు – క్రైస్తవులు, ముస్లింలతో సహా వివిధ మతాలకు చెందిన వారు కూడా విరాళాలు అందించారు. ఈ రెండు చెక్కులను సంబంధిత ట్రస్ట్ సభ్యులకు పవన్ కళ్యాణ్ అందజేశారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్