https://oktelugu.com/

Ram Charan- Shankar Movie: చరణ్, శంకర్ సినిమా పై క్రేజీ అప్ డేట్… ఆగిపోలేదు.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్ !

Ram Charan- Shankar Movie: మెగా పవర్ స్టార్  ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా   విజువల్ ఇంద్రజాలికుడు శంకర్  దర్శకత్వంలో రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా కొత్త షెడ్యూల్ ఆగిపోయింది అంటూ  సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల పై మేకర్స్  స్పందించారు. ఇదంతా ఫేక్ అని స్పష్టం చేశారు. ‘#RC15, #SVC50 వర్కింగ్ టైటిళ్లతో సాగుతున్న మూవీకి సంబంధించి ఎలాంటి షెడ్యూల్ ఆగిపోలేదు అని,  ఈ విషయంపై అందరూ అప్రమత్తంగా ఉండాలి’ అని చిత్రబృందం తెలిపింది.  ఇక ఈ సినిమా నుంచి ఆ మధ్య వచ్చిన చరణ్ లుక్ విషయానికి వస్తే… సాంప్రదాయ పంచె కట్టు, […]

Written By:
  • Shiva
  • , Updated On : September 11, 2022 / 08:21 AM IST
    Follow us on

    Ram Charan- Shankar Movie: మెగా పవర్ స్టార్  ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా   విజువల్ ఇంద్రజాలికుడు శంకర్  దర్శకత్వంలో రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా కొత్త షెడ్యూల్ ఆగిపోయింది అంటూ  సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల పై మేకర్స్  స్పందించారు. ఇదంతా ఫేక్ అని స్పష్టం చేశారు. ‘#RC15, #SVC50 వర్కింగ్ టైటిళ్లతో సాగుతున్న మూవీకి సంబంధించి ఎలాంటి షెడ్యూల్ ఆగిపోలేదు అని,  ఈ విషయంపై అందరూ అప్రమత్తంగా ఉండాలి’ అని చిత్రబృందం తెలిపింది. 

    Ram Charan- Shankar

    ఇక ఈ సినిమా నుంచి ఆ మధ్య వచ్చిన చరణ్ లుక్ విషయానికి వస్తే… సాంప్రదాయ పంచె కట్టు, వైట్ అండ్ వైట్ లుక్‌లో హ్యాండ్ మడతెట్టి సైకిల్ తొక్కుతూ రామ్ చరణ్ కనిపించాడు. మొత్తానికి ఈ ఫోటోలో చరణ్ లుక్ అదిరిపోయింది. అందుకే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది.

    Also Read: Megastar Chiranjeevi: చిరంజీవికి కోపమొచ్చింది.. డైరెక్టర్లకు చురకలు

    దాంతో చరణ్ – శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ చెప్పిన పొలిటికల్ కథ డైరెక్టర్ శంకర్‌కు నచ్చింది. ఈ సినిమాకు కార్తిక్ కథ ఇవ్వగా చిత్రానికి దర్శకత్వం శంకర్ చూసుకుంటున్నారు. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

    రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడు. రాజకీయ డ్రామా అంటే.. సినిమా కాస్త సీరియస్ టోన్ లో సాగనుంది. నిజానికి ఈ సినిమా మొదట ఫ్యామిలీ డ్రామా అన్నారు. కానీ.. ఇది కూడా పొలిటికల్ డ్రామా అని తెలిసే సరికి ఫ్యాన్స్ కి సినిమా పై ఆసక్తి మరింతగా రెట్టింపు అయింది.

    Ram Charan- Shankar Movie

    కారణం.. పొలిటికల్ డ్రామాలను శంకర్ అద్భుతంగా తీస్తాడు. ఇక ఈ సినిమాలో మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ ‘అరవింద స్వామి’ మెయిన్ విలన్ గా నటించబోతున్నాడు. నిజానికి చరణ్ తో ఇప్పటికే అరవిందస్వామి ‘ధ్రువ’ సినిమాలో నటించాడు. ఈ కాంబినేషన్ బాగా సక్సెస్ అయ్యింది కూడా. ఇప్పుడు మరోసారి ఈ కలయికలో మరో భారీ సినిమా వస్తోంది అనేసరికి ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    Also Read:NTR- Koratala Siva Movie: ఎన్టీఆర్ సినిమా పై క్రేజీ అప్ డేట్.. ఫ్యాన్స్ కి ఇది పండగే

    Tags