మంచు మోహన్ బాబు(Mohan Babu) వారసుడిగా మంచు విష్ణు తెలుగు తెరకు పరిచయం అయినా… ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయారు. అయితే, తన అపజయాల వెనుక అసలు కారణాలు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు(Manchu Vishnu) చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఇంటర్వ్యూలోనే పలు ఆసక్తికరమైన విషయాలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పాడు.
తనకు సక్సెస్ రాకపోవడానికి కారణం చెబుతూ.. ‘నేను నా కెరీర్ లో మంచి డైరెక్టర్లను ఎంపిక చేసుకోలేకపోయాను. నా సినీ జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అది’ అంటూ మంచు విష్ణు చెప్పడం విశేషం. ఇక తన తండ్రి గురించి చెబుతూ.. మా నాన్నగారు భారతదేశంలోని ప్రస్తుతం లెజెండరీ నటుల్లో ఒకరు, ఆలాగే ముఖ్యులు కూడా. అలాంటి ఆయన కడుపున పుట్టడం నా అదృష్టం.
అయితే, మా నాన్నగారి కారణంగా నాకు ఒకట్రెండు చిత్రాలు ఎలాంటి కష్టం లేకుండా రావొచ్చు. కానీ, వరుసగా అవకాశాలు రావాలి అంటే.. ఎవరైనా కష్టపడాల్సిందే. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటేనే కెరీర్ నిలబడుతుంది. ఇక నా విషయానికి వస్తే.. నాకు టాలెంట్ ఉంది కాబట్టే నేను ఇంకా ఇండస్ట్రీలో ఉండగలిగాను’ అని మంచు విష్ణు తెలిపాడు.
తన అక్కయ్య మంచు లక్ష్మీ గురించి చెబుతూ.. ‘మా నాన్నగారికి మా అక్క లక్ష్మి అంటే ఎందుకంత ప్రేమో.. నాకు ఆడపిల్లలు పుట్టినప్పుడు అర్థమైంది’ అని చెప్పి, ‘ఇంకా పిల్లల్ని కందామా? అని నేను నా భార్యని అడిగితే.. ‘ఇంకెవరినైనా చూస్కో’ అంది అని విష్ణు సరదగా నవ్వుతూ సమాధానమిచ్చాడు.
అయితే, సదరు యాంకర్ అలీ మరో ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతూ.. ‘మీకు మీ తమ్ముడు మనోజ్ మీద చాలా కోపం అట ? దీని పై మీరేమంటారు?అని అడగానే.. విష్ణు సీరియస్ గా ‘ఎందుకు చెప్పాలి’ అంటూ లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేయడం విశేషం. ఇక విష్ణు ‘మా’ ఎన్నికల గురించి ఏం మాట్లాడారు? అలాగే తన భవిష్యత్తు సినిమాల గురించి ఏమి చెప్పారు ? లాంటివి తెలియాలంటే ఈ ‘అలీతో సరదాగా’ పూర్తి ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యే ఎదురుచూడాల్సిందే.