Alia Bhatt- Ranbir Kapoor Wedding: రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఏప్రిల్ 14న వివాహబంధంతో ఒక్కటి అయ్యారని మీడియా తల బాదుకోవడం తప్పితే.. ఈ జంట మాత్రం పెళ్లి అయిపోయే వరకు నోరెత్తలేదు. ఐతే పెళ్లి అనంతరం అలియా ‘మా వివాహం అయిపోయింది’ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇప్పుడు తాజాగా వీరి పెళ్లికి సంబంధించి కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే, ఈ పిక్స్ ల్లో తోడి పెళ్లికూతుళ్లతో రణ్‌బీర్ దిగిన ఫొటో మాత్రం హైలైట్ గా ఉంది. ‘ఈ ఫోటో సూపర్ గా ఉంది’ అంటూ నెటిజన్లు కూడా ఇంట్రెస్టింగ్ గా మెసేజ్ లు చేస్తున్నారు. కారణం.. ఈ ఫొటోల్లో పొలిటికల్ ప్రార్థన రీతిలో రణ్ బీర్ తో ‘కొందరు అలియా ఫ్రెండ్స్’ పట్టుబట్టి ప్లేడ్జ్ రాయించారు.
Also Read: Pavan Kalyan Movie Title: పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ తో విజయ్ దేవరకొండ సినిమా
ఆ ప్లేడ్జ్ లో రణ్‌బీర్ రాసిన మాటలు చాలా బాగా ఆకట్టుకున్నాయి. ‘నేను రణ్‌బీర్.. అలియా భట్ భర్తగా.. తోడిపెళ్లికూతుళ్ల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చాడు రణబీర్. మొత్తానికి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటూ ఇన్నాళ్ళకి ఒక్కటి అయ్యింది ఈ క్రేజీ జంట.

రణబీర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన అలియా.. ఇప్పుడు సంసార బంధంలో అంతకుమించి ప్రేమ ఉంటుందని చెబుతుంది. ఇక వీరి ప్రేమ పై పుకార్లు రాసి రాసి క్యాష్ చేసుకున్న గాసిప్ రాయుళ్లు.. మరికొన్ని రోజుల్లో అలియా తల్లి కాబోతుంది అంటూ కొత్త పుకార్లు పుట్టించడానికి సన్నద్ధం అవుతున్నారు.
ఏది ఏమైనా ఎన్నాళ్లో వేచిన ఉదయం ఇన్నేళ్లకు పూసింది. ఈ లవ్‌బర్డ్స్ అధికారికంగా ఒక్కటి అయ్యారు. ఈ బ్యూటిఫుల్ కపుల్ ఇలాగే లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలని మా ఓకేతెలుగు. కామ్ తరఫున ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం.
Also Read:Actress Remuneration: ఈ సీరియల్ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?
Recommended Videos:


