
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ “ఆర్.ఆర్.ఆర్” సినిమా షూటింగ్ లో గత పది రోజుల నుండి పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే, నిన్నటితో ఆమెకు సంబంధించిన సీన్స్ పూర్తి అయ్యాయట. ఇక ఈ సినిమా వరకు ఆమెకిది ఫస్ట్ షెడ్యూలు. జనవరిలో జరగనున్న రెండో షెడ్యూల్లో రామ్ చరణ్, అలియా పై ఒక రొమాంటిక్ సాంగ్, సీన్లను షూట్ చేయనున్నారు. అయితే “ఆర్.ఆర్.ఆర్” షూటింగ్ పూర్తి కాగానే ఆలియా వెంటనే ముంబై వెళ్ళి.. అక్కడి నుంచి తన ప్రియుడు రణబీర్ కపూర్ తో కలిసి గోవా వెళ్ళి ఎంజాయ్ చేస్తోందట. తన సినిమాల కమిట్ మెంట్స్ పూర్తి చేసుకొని రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకోనుంది.
Also Read: ‘ఆర్‌ఆర్‌ఆర్’లో టాలెంటెడ్ కమెడియన్ కూడా కీలకమేనట !
ఏది ఏమైనా బాలీవుడ్ లో ఎంత సపోర్ట్ ఉన్నా అక్కడ్ స్టార్ హీరోయిన్ గా చలామణి అవ్వడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ, హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొన్ని నెలలకే స్టార్ హీరోయిన్ అయి ఆలియా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకుంది. నిజానికి ఆలియా ఇప్పటికిప్పుడు వరుసగా నాలుగైదు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోన్నా.. ఒక్కో సినిమాకి 8-10 కోట్ల పారితోషికం అందుకునే రేంజ్ కి వెళ్లినా.. ఇప్పటికీ డైరెక్టర్లకు అందుబాటులో ఉంటుంది. డేట్స్ విషయంలో ఎప్పుడూ ఎవర్ని ఇబ్బంది పెట్టిన సంఘటనలు లేవు.
Also Read: ఎక్స్ క్లూజివ్: హిట్ కాంబినేషన్ లో మరో ఎంటర్ టైనర్ !
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఇందులో స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. అతడి సరసన సీత పాత్రలో అలియా నటిస్తోంది. ఈ సినిమాలో ఆలియా పై కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయని.. కాగా ఈ సీన్స్ వెరీ ఎమోషనల్ గా ఉంటాయని.. ఆలియా ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటిస్తోందని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ ను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అన్ని సాంగ్స్ కీరవాణి ఇప్పటికే పూర్తి చేశాడట. ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్