Alekhya Chitti : ఈమధ్య కాలంలో సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన మోతమోగిపోయిన పేరు అలేఖ్య చిట్టి పికిల్స్(Alekhya Chitti Pickles). పికిల్స్ ని కొనుగోలు చేసే ఒక కస్టమర్ ఇంత రేట్స్ ఉన్నాయి ఏంటండీ అని అన్నందుకు అతనిపై బూతుల వర్షం కురిపిస్తూ అలేఖ్య చేసిన కామెంట్స్, అందుకు సంబంధించిన ఆడియో రికార్డు బాగా వైరల్ అవ్వడం తో సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆ చిన్న సంఘటన కారణంగా అద్భుతంగా జరుగుతున్న వీళ్ళ పికిల్స్ బిజినెస్ మూత పడిపోయింది. అయితే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ తిరిగి ప్రారంభించారు, ఈసారి బిజినెస్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ పికిల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ముగ్గురు అక్కా చెల్లెళ్లలో ఒకరైన రమ్య వ్యవహరిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈమె అప్లోడ్ చేసే రీల్స్ కి మామూలు క్రేజ్ ఉండదు. చూసేందుకు అచ్చు గుద్దినట్టు హీరోయిన్ లాగా అనిపించే ఈ బ్యూటీ త్వరలోనే వేడితెర అరంగేట్రం చేయనుంది.
Also Read : ‘బిగ్ బాస్ 9’ ఆఫర్ పై క్లారిటీ ఇచ్చిన అలేఖ్య చిట్టి..వీడియో వైరల్!
రీసెంట్ గానే అలేఖ్య చిట్టి ఒక వీడియో లో మాట్లాడుతూ ‘నేను పలు సినిమాల్లో కూడా నటించాను. అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేసింది’. ప్రముఖ టెలివిజన్ యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వచ్చినవాడు గౌతమ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్ లో రమ్య(Ramya) పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో ఆమె ఒక కీలక పాత్ర పోషించినట్టు ఈ సంఘటన ద్వారా తెలిసింది. చూపులు తిప్పుకోలేని అందంతో కుర్రాళ్ళ మతులను పోగొట్టే రమ్య ఇంతకాలం కేవలం ఇన్ స్టాగ్రామ్ కి మాత్రమే పరిమితం అయ్యింది. ఇక నుండి ఈమె అందాలను వెండితెర పై కూడా చూడొచ్చు అన్నమాట.
ఇది రీసెంట్ గా జరిగిన వివాదం కారణంగా బాగా ఫేమస్ అవ్వడం వల్ల వచ్చిన అవకాశం కాదు. అంతకు ముందే ఆమెకు ఈ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. అంటే ఆమె ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఏ రేంజ్ లో పాపులర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంతకు ముందు ఆమె నటించిన సినిమాలు మాత్రమే కాకుండా, లేటెస్ట్ గా కూడా ఆఫర్స్ వస్తున్నాయట. ఒక ప్రముఖ స్టార్ హీరో సినిమాలో ఒక కీలక పాత్ర పోషించే అవకాశం దక్కిందట. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అంతే కాదు ఈ సీజన్ బిగ్ బాస్ లో కూడా ఈమె పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నాకు వాళ్ళ వైపు నుండి ఎలాంటి పిలుపు రాలేదని రమ్య చెప్పింది కానీ, భవిష్యత్తులో వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చూడాలి మరి వీళ్ళ జాతకాలు ఎలా మలుపు తిరగబోతున్నాయి అనేది.
Also Read : అలేఖ్య చిట్టి పికిల్స్ పై సెలబ్రెటీ షాకింగ్ వీడియో..