Bollywood: బాలీవుడ్ లో చంకీ పాండే తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. కమెడియన్ గా, హీరోగా, విలన్ గా నటించడమే కాకుండా తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు. హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందారు. అయితే బాలీవుడ్ లో ఖాన్ , కపూర్ కుటుంబాలకు ఉండే గుర్తింపు “పాండే ఫ్యామిలీస్ కి కూడా ఉందని చెప్పాలి. అయితే తండ్రి బాటలో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు పొందిన హీరోయిన్ గా అనన్య పాండే పేరు చెప్పుకోవచ్చు. ఆకర్షణీయమైన అందంతో పాటు తన హాట్ హాట్ పిక్చర్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ భామ. ఇదిలా ఉంటే అనన్య పాండే కజిన్ సిస్టర్ అయిన “అలానా పాండే” ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అలానా పాండే హలో ఫారిన్ లో మోడలింగ్ చేస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ పిటిఓలకు ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మంచి క్రేజ్ పొందింది ఈ భామ. అలానా పాండే ఐవోర్ అనే వ్యక్తి తో గత కొన్ని ఏళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం తన ప్రియుడు ఐవోర్ తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ క్రమంలోనే అతడు ఆమెకు ప్రపోజ్ చేసి ఆశ్చర్యపరిచి తన చేతికి రింగ్ తొడిగాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటూ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది అలనా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.