Homeఎంటర్టైన్మెంట్Akshay Kumar mom Aruna Bhatia dies : విషాదం: స్టార్ హీరోకి మాతృవియోగం...

Akshay Kumar mom Aruna Bhatia dies : విషాదం: స్టార్ హీరోకి మాతృవియోగం !

Akshay Kumar mom diedAkshay Kumar mom Aruna Bhatia dies: బాలీవుడ్ ఫ్యామిలీ హీరో అక్ష‌య్ కుమార్ (Akshay Kumar)కి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ‘అరుణా భాటియా’ ఈ ఉదయం అనారోగ్య కారణంగా మరణించారు. ఆమె గత కొంతకాలంగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే, గత వారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబయిలోని హీరా నందిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు.

అక్షయ్ కుమార్ కూడా తన తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొన్ని రోజుల కిందట లండన్ లో జరుగుతున్న తన సినిమా షూట్ ను మధ్యలోనే ఆపేసి తిరిగి ఇండియా వచ్చేశారు. అక్షయ్ తన తల్లికి దగ్గర ఉండి ఎంతో విలువైన చికిత్స చేయించినా ఉపయోగం లేకుండా పోయింది. అరుణా భాటియా ఈ రోజు ఉదయం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

తన తల్లి తుదిశ్వాస విడవడంతో అక్షయ్ కుమార్ తీవ్ర విషాదానికి లోనయ్యారు. తన ఆవేదనను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. “నాకు నా సర్వం మా అమ్మే. ఈ రోజు నుంచి ఆమె ఇక లేదు. మరో లోకంలో ఉన్న మా నాన్నను తిరిగి కలిసేందుకు వెళ్లిపోయారు. మా అమ్మగారి కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు… ఓంశాంతి” అని ఆయన ఎమోషనల్ మెసేజ్ చేశారు.

కాగా అరుణా భాటియా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సినీ దిగ్గజాలు కూడా సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తూ తమ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున అరుణా భాటియా మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version