దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తుంది. కరోనా నివారణ కేంద్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా 21రోజుల లాక్డౌన్ చేపట్టింది. ఈ మహమ్మరిని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు ప్రముఖులు, సెలబెట్రీలు విరాళాలు అందజేస్తూ తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. టాలీవుడ్ సినీ సార్లు కరోనా నివారణ కోసం భారీగా విరాళాలు ప్రకటించారు. అయితే బాలీవుడ్ స్టార్లు ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా విరాళాలు ప్రకటించకపోవడం విమర్శలకు తావిచ్చింది. అయితే తాజాగా బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్ కుమార్ ప్రధాన మంత్రి సహాయనిధికి 25కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో ప్రతీఒక్కరు తమవంతు సహకారం అందజేయాలని కోరారు.
కరోనా వైరస్ కారణంగా చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుంది. ఇప్పటికే షూటింగ్లు వాయిదా పడగా లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో రోజువారి సీని కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు పలువురు స్టార్లు ముందుకొచ్చారు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘సీసీసీ మనకోసం’ ఛారిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో సీని కార్మికుల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అదేవిధంగా టాలీవుడ్లో అత్యధికంగా ప్రభాస్ 4కోట్ల రూపాయాలను విరాళం ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2కోట్లు, చిరంజీవి ఒక కోటి, మహేష్ బాబు ఒక కోటి, జూనియర్ ఎన్టీఆర్ 75లక్షలు, రాంచరణ్ 70లక్షలు, బాలకృష్ణ 50లక్షలు, నితిన్ 20లక్షలు, త్రివిక్రమ్ 20లక్షలు, దిల్ రాజు 10లక్షలు, వంశీ పైడిపల్లి 10లక్షలు, కొరటాల శివ 10లక్షలు, సాయిధరమ్ తేజ్ 10లక్షలు తదితరులు సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. తద్వారా ప్రజలు కష్టాల్లో తమవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని చెప్పకనే చెప్పారు. కాగా దేశంలో ఇప్పటివరకు 933కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 20మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.