బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్… రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా హీరోయేనని మరోసారి నిరూపించుకున్నాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో అక్షయ్ కుమార్ ఎప్పుడు ముందుంటాడు. ఇప్పటికే చాలా మందికి సహాయం చేసిన అక్షయ్ కుమార్ ఇప్పుడు దర్శకుడు రాఘవ లారెన్స్ తో కలిసి చెన్నైలో హిజ్రాల కోసం భవనాన్ని నిర్మించడానికి రూ.కోటిన్నర విరాళమిచ్చారు.
ఇక లారెన్స్ కూడా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేసాడు.. లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్స్ చేయడమే కాకుండా వికలాంగులకు విద్య, వసతి, ఆరోగ్యం వంటి సదుపాయలు కల్పించాడు.. తన చారిటబుల్ ట్రస్ట్ 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా చెన్నైలోని ట్రాన్స్ జెండర్స్ వసతికోసం ఓ భవనాన్ని నిర్మించాలని అనుకున్నాడు.ఈ విషయాన్నీ లారెన్స్ తన ఫేస్ బుక్ ద్వారా ప్రకటించాడు.
‘హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్, నేను ఒక శుభవార్త పంచుకోవాలనుకుంటున్నాను.. లక్ష్మీబాంబ్’ షూటింగ్ సందర్భంగా మా ట్రస్ట్ ప్రాజెక్టుల గురించి, హిజ్రాలకు ఇళ్ల నిర్మాణం గురించి అక్షయ్ సార్‌తో మాట్లాడాగా అయన మరో మారు ఆలోచించకుండా కోటిన్నర రూపాయలు విరాళం ఇచ్చారు. ఆయనకి మా కృతజ్ఞతలు.. ప్రస్తుతం మా ట్రస్ట్ ద్వారా భూమిని సేకరిస్తాం. ఇళ్ల నిర్మాణం కోసం మరిన్ని నిధులు సేకరిస్తున్నామని లారెన్స్ పేర్కొన్నారు.