Akkineni Supriya: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుతున్నారు. ఇక నాగార్జున మేనకోడలు అయిన సుప్రియ యార్లగడ్డ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ మూవీ ఒకే అనిపించుకున్నప్పటికి తను హీరోయిన్ గా సెట్ అవ్వలేదనే విమర్శలను ఎదుర్కొంది. ప్రస్తుతం ఆమె ప్రొడ్యూసర్ గా మారింది. గతంలో వాళ్ళు కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేసినప్పటికి అక్కినేని ఫ్యామిలీ హీరోలతోనే ప్రొడ్యూస్ చేశారు. కానీ ఫస్ట్ టైమ్ అడివి శేషు ను హీరోగా పెట్టి ఆమె చేసిన ‘డెకాయిట్’ సినిమాను చేసింది.
ఈ మూవీ మరో రెండు రోజుల్లో రిలీజ్ కి రెడీ అవ్వనున్న నేపథ్యంలో ఈ సినిమాతో ఆమె సక్సెస్ ని సాధిస్తుందా? అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమాను మధ్యలో కొద్దిరోజులు ఆపేశారు. ఇక ఎట్టకేలకు ఈ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది అంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంటుంది.
ఇక ఈ సినిమా సైతం ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తే మాత్రం సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుంది. అలా కాకుండా ప్రేక్షకుడిని నిరాశపరిచినట్లయితే మాత్రం సినిమా బొక్క బోర్ల పడ్డట్టే అని చాలామంది చెబుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుప్రియ టాప్ ప్రొడ్యూసర్ గా మారాలి అంటే మాత్రం ఈ సినిమాతో సక్సెస్ ని సాధించాలి. అలాగే మరికొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తే తప్ప ఆమె టాప్ పొజిషన్ ను అందుకునే ప్రసక్తి లేదు.
కాబట్టి ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా సక్సెస్ అనేది కీలకంగా మారబోతోంది. ఇక ఈ మూవీ తర్వాత ఆమె సిద్దు జొన్నలగడ్డ ను హీరోగా పెట్టి ఒక పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. డెకాయిట్ రిజల్ట్ ను బట్టే ఈ సినిమా బడ్జెట్ కూడా ఆధారపడి ఉంటుందని ప్రముఖులు చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని భారీ లెవెల్లో చేస్తున్నప్పటికి సినిమా టాక్ ను బట్టి గా మారుతుందని చెప్పొచ్చు…