https://oktelugu.com/

ANR: అసమాన్య ప్రతిభకు తార్కాణం…అక్కినేని

– ఏఎన్ఆర్ చిత్రాలు రీమేక్ చేసేందుకు తహతహ.. -నటనలో నటసామ్రాట్ ను మరిపించలేకపోయామని బాహాటంగా ఒప్పుకున్న బాలీవుడ్ అగ్రనటులు అక్కినేని నటించిన అనేక చిత్రాలు హిందీలో రీమేక్ అయ్యాయి. కొన్ని హిందీ సినిమాల ఆధారంగా తీసిన వాటిలో కూడా అక్కినేని నటించారు. హిందీ రీమేక్ సినిమాలో అక్కినేని పాత్రలు ఎక్కువగా పోషించిన నటులు.. రాజేంద్ర కుమార్, సునీల్ దత్, జితేంద్ర. ఐతే అశోక్ కుమార్, కిషోర్ కుమార్, రాజ్ కపూర్, దిలీప్ కుమార్, ధర్మేంద్ర, శశికపూర్, రాజ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 23, 2022 / 07:58 PM IST
    Follow us on

    – ఏఎన్ఆర్ చిత్రాలు రీమేక్ చేసేందుకు తహతహ..
    -నటనలో నటసామ్రాట్ ను మరిపించలేకపోయామని బాహాటంగా ఒప్పుకున్న బాలీవుడ్ అగ్రనటులు

    అక్కినేని నటించిన అనేక చిత్రాలు హిందీలో రీమేక్ అయ్యాయి. కొన్ని హిందీ సినిమాల ఆధారంగా తీసిన వాటిలో కూడా అక్కినేని నటించారు. హిందీ రీమేక్ సినిమాలో అక్కినేని పాత్రలు ఎక్కువగా పోషించిన నటులు.. రాజేంద్ర కుమార్, సునీల్ దత్, జితేంద్ర. ఐతే అశోక్ కుమార్, కిషోర్ కుమార్, రాజ్ కపూర్, దిలీప్ కుమార్, ధర్మేంద్ర, శశికపూర్, రాజ్ కుమార్, గురుదత్, సంజీవ్ కుమార్, రాజేష్ ఖన్నా, రణధీర్ కపూర్ వంటి అగ్ర హీరోలు కూడా అక్కినేని పాత్రలు పోషించారు. ఈ బాలీవుడ్ హీరోలందరూ మంచి నటులే ఐనా అక్కినేని పాత్రల వద్దకు వచ్చేసరికి.. ఒక్క అశోక్ కుమార్ తప్ప ఏ ఇతర హీరోలు కూడా అక్కినేనికి (నటనలో) సరితూగలేకపోయారు ఆయా రోల్స్ లో. అశోక్ కుమార్ నటించిన గృహస్థి రీమేక్ ‘మంచి కుటుంబం’ లో అక్కినేని.. అశోక్ కుమార్ కు ఏమాత్రం తీసిపోని విధంగా నటించారు. ఈ బాలీవుడ్ హీరోల్లో చాలా మంది.. వారు నటించిన అక్కినేని పాత్రల్లో ఆయనలా నటించలేకపోయామని బాహాటంగానే అంగీకరించారు. ఉదాహరణకు.. “నువ్వు కుర్రాడిలా డాన్స్ లు చేసేస్తుంటే నన్ను కూడా అలా చేయమంటున్నారు. నీలా నేనెలా చేసేది..” అని అశోక్ కుమార్ పలు సందర్భాల్లో ఏఎన్ఆర్ తో చెప్పారు.

    “అక్కినేని దేవదాసు ముందే చూసుంటే నేను హిందీ దేవదాసు చేయకపోయి ఉండేవాణ్ణి” అని దిలీప్ కుమార్ ఓ సందర్భంలో తెలిపారు. అక్కినేని ఆరాధన హిందీ రీమేక్ ప్రేమ్ పత్ర్ లో శశికపూర్ నటించాడు. ఆ సందర్భంలో ఆరాధన చూశాక.. “అక్కినేని ముందు నేనెంత..” అని శశికపూర్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.  “అక్కినేని, నేను ఇద్దరం రొమాంటిక్ హీరోలమే.. ఆయన అనుభవం ముందు నా అనుభవం ఎంత” అని రాజేష్ ఖన్నా వెల్లడించారు. “అక్కినేని నటించిన సుమంగళి హిందీ రీమేక్ సుహాగన్ లో నేను నటించాను. ఆయన తరహా నటనలో నా నటన ఇమడదు. ఆయన నటనకు జోహార్లు చెప్పాల్సిందే..అని – గురుదత్ బాహాటంగానే వెల్లడించాడు.

    “అక్కినేని హిందీ రీమేక్ చాలావాటిలో నటించాను. ఆయనలా నటించడానికి ప్రయత్నం చేశాను..” అని -రాజేంద్ర కుమార్ పేర్కొనడం గమనార్హం.  “అక్కినేని ధర్మదాత హిందీ చిత్రంలో (దిల్ కా రాజా) ఆయన పాత్ర నాచేత వేయించి ఆ దర్శక నిర్మాతలు చాలా పెద్ద తప్పు చేశారు..” అని రాజ్ కుమార్ చెప్పడం ఏఎన్ ఆర్ నటనకు గీటురాయి అని చెప్పవచ్చు.

    “నవరాత్రి తమిళ తెలుగు వెర్షన్స్ లలో శివాజీ గణేశన్, అక్కినేని నాగేశ్వరరావు తొమ్మిది పాత్రలను చాలా గొప్పగా పోషించారు. హిందీ వెర్షన్ నయాదిన్ నయీరాత్ లో ఆ తొమ్మిది పాత్రలు పోషించడానికి చాలా కష్టపడ్డాను” అని అప్పటి అగ్ర నటుడు సంజీవ్ కుమార్ చెప్పడం ఏఎన్ ఆర్ ప్రతిభను చూపుతున్నది.
    – శెనార్తి