Akkineni Naga Chaitanya: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారనే చెప్పాలి. ఇటీవల సాయి పల్లవితో జతగా నటించిన ” లవ్ స్టోరీ ” సినిమా ఘన విజయం దక్కించుకుంది. అయితే సమంత – నాగ చైతన్య తమ వివాహ బంధానికి వీడ్కోలు చెబుతూ… విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో వీరిద్దరిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలను పట్టించుకోకుండా తమ జీవితాలలో బిజీ అవుతున్నారు. కాగా సోషల్ మేడ లో సమంతా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆమెతో పోలిస్తే చైతూ అంతా యాక్టివ్ గా ఉండరు.

వారి విడాకుల ప్రకటన తర్వాత చైతన్య సోషల్ మీడియా లో ఎటువంటి పోస్ట్ లు చేయలేదు. అయితే ఇప్పుడు తాజాగా నాగ చైతన్య చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ” గ్రే జీవాలే ” అని ట్వీట్ చేశారు నాగ చైతన్య. ఆ ట్వీట్ ఎవరి గురించి చేశారు… ఎందుకు చేశారు అంటూ నెటిజన్లు పోస్ట్ లు చేస్తున్నారు. అది ఫేమస్ రేసర్ పేరు అని, ఈ రోజు అతను చివరి రైడ్ చేసి వీడ్కోలు తీసుకుంటున్నాడట. చైతన్య కి రేసింగ్ అంటే బాగా ఇష్టం కాబట్టే ఆ ట్వీట్ చేసి ఉంటారని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీంతో నాగ చైతన్య రేసింగ్ నేపధ్యంలో ఒక సినిమా చేయాలని అక్కినేని అభిమానులంతా కోరుకుంటున్నారు.
https://twitter.com/chay_akkineni/status/1459884360492929031?s=20