Fans protest against Nagarjuna: టాలీవుడ్ తన మనసుకి నచ్చినట్టు, అవతల వాళ్ళు ఏమనుకున్నా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లే హీరోలలో ఒకరు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna). సీనియర్ హీరోలలో అతి పెద్ద సూపర్ స్టార్. చిరంజీవి(Megastar Chiranjeevi), బాలకృష్ణ(Nandamuri Balakrishna) తర్వాత అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో ఆయన. ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ని అందుకొని, ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన క్యారెక్టర్స్ ఎన్నో చేసి, తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అలాంటి హీరో ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్ లో ఉండడం, ఆ తర్వాత ఆయన క్యారక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అవ్వడం బెటర్ అంటూ ‘కుబేర’, ‘కూలీ’ చిత్రాలు చేయడం అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘కుబేర’ లో పాజిటివ్ రోల్ అయినప్పటికీ, ఆయన చనిపోయే సన్నివేశం చేసినప్పుడు అభిమానులు చాలా బాధపడ్డారు. ఇక నిన్న విడుదలైన ‘కూలీ'(Coolie Movie) చిత్రాన్ని చూసి అక్కినేని ఫ్యాన్స్ గుండెలు బద్దలు అయిపోయాయి.
ఇంత బ్రతుకు బ్రతికి కెరీర్ చివర్లో ఇలాంటి పాత్రలు చేయడమా? మమ్మల్ని ఎందుకు ఇంతలా టార్చర్ చేస్తున్నావ్ అంటూ అక్కినేని ఫ్యాన్స్ ట్విట్టర్ లో నాగార్జున ని ట్యాగ్ చేసి బాధపడుతున్నారు. ‘కూలీ’ చిత్రం లో నాగార్జున విలన్ రోల్ చేస్తున్నాడని ఫ్యాన్స్ కి ఎప్పుడో తెలుసు. కానీ విలన్ రోల్ అయినప్పటికీ కూడా ‘విక్రమ్’ లో రోలెక్స్ రేంజ్ పవర్ ఫుల్ గా ఉంటుందేమో, ఆ మాత్రం ఉంటే పండగే అని అనుకున్నారు. కానీ తీరా చూస్తే రెగ్యులర్ విలన్ క్యారక్టర్ చేసాడు. అసలు ఈ సినిమాలో నాగార్జున ఉన్నా లేకపోయినా కూడా కథపై ఎలాంటి ప్రభావం చూపదు, ఎదో కొన్ని సన్నివేశాల్లో బలవంతంగా విలనిజం చూపించినట్టు ఉంటుంది కానీ, ఆడియన్స్ అసలు ఆయన్ని విలన్ లాగానే చూడలేకపోయారు. కేవలం రజినీకాంత్(Superstar Rajinikanth) చేతిలో చావు దెబ్బలు తినడానికే ఆయన క్యారక్టర్ ని క్రియేట్ చేసినట్టు ఆడియన్స్ కి అనిపించింది.
అక్కినేని అభిమానులు పాపం రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ వద్ద భారీగా బ్యానర్స్ కటౌట్స్ వేశారు. వాళ్లకు నాగార్జున క్యారక్టర్ ని చూసి ఏ రేంజ్ కోపం కలిగి ఉంటుందో ఊహించుకోండి. ఉదాహరణకు ఒక సంఘటన తీసుకుంటే, వైజాగ్ లోని లీలామహల్ థియేటర్ లో నాగార్జున అభిమానులు భారీగా బ్యానర్స్ ని ఏర్పాటు చేశారు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఇంతటి పనికిమాలిన క్యారక్టర్ చేసినందుకు నాగార్జున పై ఫైర్ అయ్యి బ్యానర్స్ ని చింపివేశారు. అక్కినేని ఫ్యామిలీ పరువు తీసాడంటూ అభిమానులు వాపోయారు. అభిమానుల నిరసన సెగ ఎట్టి పరిస్థితిలోనూ నాగార్జున వరకు వెళ్లాలని, ఇక మీదట ఇలాంటి క్యారెక్టర్స్ చేయకుండా ఆపాలని సోషల్ మీడియా లో ఉన్నటువంటి అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి నాగార్జున అభిమానుల కోరికని మన్నిస్తాడా, లేదా ఆయనకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తాడా అనేది చూడాలి.