https://oktelugu.com/

Akkineni Family English Titles: అక్కినేని ఫ్యామిలీ కొంపముంచుతున్న ‘ఇంగ్లీష్’ టైటిల్స్.. బాగా గమనిస్తే ఆశ్చర్యపోతారు!

ఆఫీసర్ , వైల్డ్ డాగ్, ది ఘోస్ట్, థాంక్యూ, ఏజెంట్ మరియు రీసెంట్ గా 'కస్టడీ' ఇవన్నీ ఇంగ్లీష్ టైటిల్స్. ఈ టైటిల్స్ సెంటిమెంట్ కారణంగానే అక్కినేని సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. నేటివిటీ కి దగ్గరగా లేకుండా ఇష్టమొచ్చిన టైటిల్స్ పెడితే జనాలు చూడరు అనే విషయం ఈ కుటుంబ హీరోల రీసెంట్ చిత్రాలను చూస్తే అర్థం అవుతుంది.

Written By: , Updated On : May 15, 2023 / 12:52 PM IST
Akkineni Family English Titles

Akkineni Family English Titles

Follow us on

Akkineni Family English Titles: మన టాలీవుడ్ లో ఒక సినిమాకి ఓపెనింగ్స్ రావాలంటే టీజర్, ట్రైలర్ తో పాటుగా టైటిల్ కూడా చాలా ముఖ్యం,ఎందుకంటే మాస్ ఆడియన్స్ మొట్టమొదట ఆకర్షితులు అయ్యేది టైటిల్ ని చూసే. టైటిల్ బాగుంటే అన్నీ బాగుంటాయి, కానీ అక్కినేని హీరోలకు టైటిల్స్ వల్లే సక్సెస్ రావడం లేదా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. విషయం లోకి వెళ్తే రీసెంట్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన అక్కినేని సినిమాలన్నికీ టైటిల్స్ ఇంగ్లీష్ లో ఉన్నవే.

ఆఫీసర్ , వైల్డ్ డాగ్, ది ఘోస్ట్, థాంక్యూ, ఏజెంట్ మరియు రీసెంట్ గా ‘కస్టడీ’ ఇవన్నీ ఇంగ్లీష్ టైటిల్స్. ఈ టైటిల్స్ సెంటిమెంట్ కారణంగానే అక్కినేని సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. నేటివిటీ కి దగ్గరగా లేకుండా ఇష్టమొచ్చిన టైటిల్స్ పెడితే జనాలు చూడరు అనే విషయం ఈ కుటుంబ హీరోల రీసెంట్ చిత్రాలను చూస్తే అర్థం అవుతుంది.

ఈ సెంటిమెంట్ అక్కినేని హీరోలకు కలిసి రానిది ఈమధ్యనే,గతం లో నాగ చైతన్య మరియు సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ‘లవ్ స్టోరీ’ సినిమా పెద్ద హిట్ అయ్యింది.ఇది కూడా ఇంగ్లీష్ టైటిల్ అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి ఈ ఇంగ్లీష్ టైటిల్స్ ని పక్కన పెట్టి, తెలుగు టైటిల్స్ పెడితే ఈసారి కచ్చితంగా హిట్ వస్తుందని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు.వినడానికి ఇది చాలా సిల్లీ గా మనకి అనిపించొచ్చు, కానీ సెంటిమెంట్ ని తూచా తప్పకుండ ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఉంటారు కదా. అభిమానులు చెప్పే మాటల్ని కూడా హీరోలు కొన్ని కొన్ని సార్లు తీసుకోవాలి.

ఇక అఖిల్ కెరీర్ తీసుకుంటే ఆయన రెండవ సినిమా ‘హలో’ ఇంగ్లీష్ టైటిల్,ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కూడా ఇంగ్లీష్ టైటిల్.ఈ రెండు చిత్రాలు బాగుంటాయి, కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడానికి కారణం టైటిల్.చూడాలి మరి రూట్ మారిస్తే అయినా ఈ హీరోలకు సక్సెస్ అందుతుందో లేదో అనేది.