https://oktelugu.com/

Akkineni family Vs Manchu Family: బాక్స్ ఆఫీస్ వద్ద మంచు ఫ్యామిలీ కి పోటీ ఇస్తున్న అక్కినేని ఫ్యామిలీ.. ఇద్దరూ ఇద్దరే !

రీసెంట్ సమయం లో అయితే ఈ ఫ్యామిలీ పరిస్థితి మరీ దారుణంగా మారింది. అక్కినేని నాగార్జున వరుసగా డిజాస్టర్ సినిమాలు తీసి 'ది ఘోస్ట్' చిత్రం తో తన స్టార్ స్టేటస్ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇక అక్కినేని ఫ్యామిలీ ప్రతిష్టని పెంచుతాడు అని ఆశించిన అఖిల్;ఇండస్ట్రీ కి వచ్చి 8 ఏళ్ళు అవుతున్నా ఇంకా బోణీ కొట్టలేదు, ఇక భారీ ఆశలు పెట్టుకున్న 'ఏజెంట్' చిత్రం భారీ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : May 13, 2023 / 12:58 PM IST

    Akkineni family Vs Manchu Family

    Follow us on

    Akkineni family Vs Manchu Family: ఇండస్ట్రీ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాసే సత్తా ఉన్న కుటుంబాలలో ఒకటి అక్కినేని కుటుంబం.ఈ కుటుంబానికి దశాబ్దాల చరిత్ర ఉంది, అక్కినేని నాగేశ్వర రావు ఇండస్ట్రీ లో రెండు కళ్ళు లాంటి వారిలో ఒకరు. ఇండస్ట్రీ లో నటించడానికి వచ్చిన నటులకు ఆయన కూడా ఒక దిక్సూచి లాంటి వాడు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన ఇండస్ట్రీ లో టాప్ 2 హీరోస్ లో ఒకడిగా కొనసాగాడు.

    ఆ తర్వాత ఆయన తనయుడు అక్కినేని నాగార్జున తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకున్నాడు.కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి అనతి కాలం లోనే టాప్ 3 హీరోస్ లో ఒకడిగా నిలిచాడు. అయితే ఆయన తర్వాతి తరం మాత్రం అక్కినేని లేజసీ ని పఠనం వైపు కొనసాగిస్తున్నారు. ఎప్పుడైనా ఒక పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ తగిలితే బ్యాడ్ లక్ అనుకోవచ్చు, కానీ వరుసగా ఈ కుటుంబ హీరోలు చేస్తున్న సినిమాలను జనాలు తిప్పి కొడుతున్నారు.

    రీసెంట్ సమయం లో అయితే ఈ ఫ్యామిలీ పరిస్థితి మరీ దారుణంగా మారింది. అక్కినేని నాగార్జున వరుసగా డిజాస్టర్ సినిమాలు తీసి ‘ది ఘోస్ట్’ చిత్రం తో తన స్టార్ స్టేటస్ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇక అక్కినేని ఫ్యామిలీ ప్రతిష్టని పెంచుతాడు అని ఆశించిన అఖిల్;ఇండస్ట్రీ కి వచ్చి 8 ఏళ్ళు అవుతున్నా ఇంకా బోణీ కొట్టలేదు, ఇక భారీ ఆశలు పెట్టుకున్న ‘ఏజెంట్’ చిత్రం భారీ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.

    ఇక వరుస సూపర్ హిట్స్ ఇస్తూ ముందుకు దూసుకుపోతున్న నాగ చైతన్య ఇప్పుడు వరుసగా ‘థాంక్యూ’,’కస్టడీ’ వంటి వరుస డిజాస్టర్స్ తో డీలా పడ్డాడు. ఇలా అక్కినేని ఫ్యామిలీ మొత్తం సంక్షోభం లో పడిపోయింది.ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా కొనసాగితే ఇక అక్కినేని ఫ్యామిలీ మరో మంచు ఫ్యామిలీ అయిపోతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన అక్కినేని హీరోల నాలుగు సినిమాలు 5 కోట్ల కంటే తక్కువ వసూళ్లను రాబట్టాయి.ఇంకో రెండు ఫ్లాప్స్ పడితే మంచు కుటుంబాన్ని జనాలు ఎలా వెలివేసారో, అలా అక్కినేని ఫ్యామిలీ ని కూడా వెలివేసే ప్రమాదం ఉంది.