Amala- Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ఎప్పుడు కూల్ గా కనిపిస్తారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో చైతు ప్రవర్తన పై చాలా పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి. అయితే, చైతుకి అంత గొప్ప ప్రవర్తన రావడానికి కారణం లక్ష్మీ దగ్గుబాటి అట. నాగార్జున మొదటి సతీమణి లక్ష్మీ దగ్గుబాటికి నాగ చైతన్య పుట్టారు. నాగార్జున, లక్ష్మీ దగ్గుబాటితో విడిపోయాక, చైతు తన తల్లి దగ్గరకే వెళ్ళిపోయాడు.

ఇక నాగార్జున ఆ తర్వాత అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ్ కి అమలకి అఖిల్ జన్మించాడు. అఖిల్.. నాగార్జున – అమల దగ్గర పెరిగాడు. నాగ చైతన్య మాత్రం చెన్నైలో తన తల్లి లక్ష్మీ దగ్గర పెరిగాడు. తాజాగా అమల చైతు పెంపకం పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నాగ చైతన్య తల్లి లక్ష్మీ గురించి కూడా అమల మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Also Read: Anil Ravipudi Balayya : బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా కథ ఇదే.. కామెడీ కేకలా ఉంటుందట..!
చైతన్య చెన్నైలో వాళ్ల అమ్మ దగ్గర పెరిగాడు. వాళ్ల అమ్మ లక్ష్మి గారు చైతన్యను ఎంతో పద్ధతిగా పెంచారు. అయితే, రెండు మూడు నెలలకు ఒకసారి చైతు హైద్రాబాద్ కు వచ్చేవాడు. అలా వచ్చిన సమయంలో చైతు ఎక్కువగా తన తండ్రితో ఎక్కువ టైం గడిపేవాడు. ఈ ఇద్దరూ అనేక విషయాల పై ముచ్చట్లు పెట్టుకునే వారు.

మరోపక్క అఖిల్ అయితే, అన్నయ్య వచ్చాడంటూ నాగ చైతన్య వెంటే తిరుగుతూ ఆడుకునే వాడు. చిన్న తనంలో అఖిల్, చైతుకి ఓ తోకలా ఉండే వాడు. అన్నా అన్నా అంటూ ఎప్పుడు చైతు వెంట పడుతూ కనిపించేవాడు. చైతు – అఖిల్ ఇద్దరూ ఆడుకునే సమయాన్ని నేను ఎంతగానో ఎంజాయ్ చేసేదాన్ని’ అని అమల చెప్పుకొచ్చారు.
అలాగే, అమల గారు అఖిల్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ.. ‘నాగ చైతన్య ఇంటికి వచ్చిన సమయంలో అఖిల్ కి నేను కూడా గుర్తుకు వచ్చేదాన్ని కాదు. ఆ సమయంలో అఖిల్ అమ్మ అవసరం లేదు’ అని అమల సరదాగా కామెంట్స్ చేశారు.
Also Read:Avatar: The Way of Water: ‘అవతార్ -2’ రిలీజ్ ఎన్ని దేశాల్లో తెలుసా..? ఇది ప్రపంచ రికార్డు
Recommend Videos
[…] […]
[…] […]