Akkineni Amala: ఒకప్పుడు సౌత్ ఇండియా లో స్టార్ హీరోయిన్ గా కొనసాగి, మన టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) తో శివ(Shiva Movie) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి అశేష ఆర్దరాభిమానాలు సొంతం చేసుకున్న హీరోయిన్ అక్కినేని అమల. శివ సినిమాతో నాగార్జున తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. మూడు దశాబ్దాల వీళ్లిద్దరి దాంపత్య జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరు కలిసి నటించిన శివ చిత్రం రీసెంట్ గానే గ్రాండ్ గా రీ రిలీజ్ అయ్యింది. మొదటి విడుదలలో ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుందో, రీ రిలీజ్ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేజేసుకుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు అమల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
ఆమె మాట్లాడుతూ ‘నా తల్లి ఐరిష్, తండ్రి బెంగాలీ. మా నాన్న చిన్నతనం లో ఉన్నప్పుడు బెంగాల్ విభజనకు గురైంది. ఆ సమయం లో మేము ఆస్తులన్నీ కోల్పాయాం. కట్టుబట్టలతో మా నాన్న రాత్రికి రాత్రి ఇంటి నుండి పారిపోయాడు. జీవితం లో పైకి ఎదగాలంటే బాగా చదువుకోవాలి అనే విషయాన్నీ గ్రహించిన మా నాన్న చదువు పై ద్రుష్టి పెట్టాడు. అలా బాగా చదువుకున్న ఆయన యూకే లో నౌకదళంలో ఉద్యోగం సంపాదించాడు. మా నాన్నది చాలా పెద్ద కుటుంబం. ఆయనకు 9 మంది చెల్లెల్లు, తమ్ముళ్లు ఉండేవారు. ఆయన కష్టపడి సంపాదించేది మొత్తం వాళ్ళకే పెట్టేవాడు’ అంటూ చెప్పుకొచ్చింది అమల. ఆమె మాట్లాడిన మాటలు ఎంతో ఆదర్శప్రాయంగా ఉన్నాయి. కష్టపడితే ఒక మనిషి ఎలాంటి ప్రతికూల పరిస్థితులను అయినా ఎదురుకోగలరు అనడానికి నిదర్శనమే అమల నాన్న గారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘మా నాన్న నౌకాదళానికి చెందినవాడు కాబట్టి, వృత్తి రీత్యా అనేక ప్రదేశాలకు మా కుటుంబాన్ని తీసుకెళ్ళేవాడు. అలా మేము వైజాగ్ కి వచ్చాము. ఆ సమయం లో నేను భరతనాట్యం నేర్చుకున్నాను. మా డ్యాన్స్ మాస్టర్ మా అమ్మ తో మీ కూతురితో మంచి టాలెంట్ ఉంది, చెన్నైల లోని కళాక్షేత్ర లో చేర్పించండి అని సూచించాడు. అలా ఆ వయస్సులోనే నాకు నటనపై చిన్న ఆసక్తి కలిగింది’ అంటూ చెప్పుకొచ్చింది. అమల ఎక్కువగా తమిళ సినిమాల్లోనే అప్పట్లో హీరోయిన్ గా నటించేది. మన తెలుగు లో ఈమె మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ‘రాజా విక్రమార్క’, విక్టరీ వెంకటేష్ తో కలిసి రక్త తిలకం, అక్కినేని నాగార్జున తో కలిసి నిర్ణయం, శివ మరియు రాజశేఖర్ తో కలిసి ఆగ్రహం వంటి చిత్రాలు చేసింది.