Shiva Re Release Closing Collections: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) హీరో గా నటించిన ‘శివ'(Shiva Movie) చిత్రం ఆరోజుల్లో ఒక విప్లవం. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మేకర్స్ ఆలోచనలను మార్చిన చిత్రమిది. అలాంటి సినిమా మన టాలీవుడ్ నుండి రావడం అందరూ గర్వంగా భావించేవాళ్లు. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని రీసెంట్ గానే 4K టెక్నాలజీ కి మార్చి, డాళ్బీ అట్మాస్ సౌండ్ తో గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ గా వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో అయితే నాగార్జున లేటెస్ట్ చిత్రాలకంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా విజయవంతంగా థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరం గా చూద్దాం. బహుశా ఈ రిలీజ్ కలెక్షన్స్ ని భవిష్యత్తులో ఏ సీనియర్ హీరో రీ రిలీజ్ సినిమా కూడా బ్రేక్ చెయ్యలేదు అనుకోవచ్చు.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 4 కోట్ల 60 లక్షల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా నైజాం, ఓవర్సీస్ ప్రాంతాల్లో అద్భుతంగా పెర్ఫార్మన్స్ చూపించింది. ఓవర్సీస్ లో దాదాపుగా 80 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, నైజాం ప్రాంతం నుండి దాదాపుగా 2 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్ళనూయి రాబట్టింది. అదే విధంగా ఆంధ్ర, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాలకు కలిపి ఈ సినిమా మరో కోటి 80 లక్షల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ హైదరాబాద్ లో ఈ చిత్రం రన్ అవుతూనే ఉంది. ఒక సినిమా రీ రిలీజ్ సినిమా వారం రోజులు దాటి థియేటర్స్ లో నిలబడడం అనేది సాధారణమైన విషయం కాదు.
నేటి తరం స్టార్ హీరోలకు శివ కలెక్షన్స్ ని దాటడం పెద్ద విషయం కాదు కానీ, సీనియర్ హీరోల సినిమాలకు మాత్రం కాస్త కష్టమే. కేవలం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఈ రికార్డు ని అందుకోగలడు. కానీ ప్రొమోషన్స్ కూడా శివ సినిమా రేంజ్ లోనే చెయ్యాలి. నాగార్జున గడిచిన పదేళ్లలో తన కొత్త సినిమా విడుదల సమయం లో కూడా ఈ రేంజ్ ప్రొమోషన్స్ చేయలేదు. ఏకంగా బిగ్ బాస్ రియాలిటీ షో లో ఒక ఎపిసోడ్ మొత్తాన్ని ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం వాడేసుకున్నాడు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా రికార్డ్స్ ని ఏ సీనియర్ హీరో బద్దలు కొట్టబోతున్నారు అనేది.