Most Eligible Bachelor: సాలిడ్ హిట్ కోసం అక్కినేని అఖిల్ చాలా కష్టపడ్డాడు. కానీ ఆ హిట్ ఇప్పటికైనా వచ్చిందా అంటే డౌటే. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా, యూత్ లో క్రేజ్ ఉన్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం అఖిల్ విజయవంతం అవ్వలేకపోతున్నాడు. అయితే, అఖిల్ హీరోగా వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా సూపర్ హిట్ అయిందని సినిమా యూనిట్ ప్రచారం చేసుకుంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
అసలు భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం నిజంగానే హిట్ అయిందా ? లేక, మేకర్స్ బూటకపు కలెక్షన్స్ ను ఊదరగొడుతూ లేనిపోని హడావుడి చేస్తున్నారా ? ఒకసారి ఈ సినిమాను ఎంతకు అమ్మారు ? అలాగే ఇప్పటివరకు ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి ? ఇలా ఈ మొత్తం లెక్కల పై ఓ లుక్కేస్తే గానీ క్లారిటీ రాదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాను రూ. 17.70 కోట్లకు అమ్మారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కలిపి మొత్తంగా ఈ సినిమాకు జరిగిన బిజినెస్ రూ. 18.70 కోట్లు అని తెలుస్తోంది.
మరి ఇప్పటివరకు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ను చూస్తే.. మొత్తం ఏడు రోజులకు గానూ వివిధ ప్రాంతాల్లో ఈ విధంగా కలెక్షన్స్ వచ్చాయి.
నైజాం – రూ. 7 కోట్లు,
సీడెడ్ – రూ. 3.71 కోట్లు,
ఉత్తరాంధ్ర – రూ. 2.16 కోట్లు,
ఈస్ట్ గోదావరి – రూ. 1.10 కోట్లు,
వెస్ట్ గోదావరి – రూ. 89 లక్షలు,
గుంటూరు – రూ. 1.26 కోట్లు,
కృష్ణా – రూ. 98 లక్షలు,
నెల్లూరు – రూ. 75 లక్షలు
అంటే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ. 17.85 కోట్లు షేర్‌తో పాటు రూ. 29.40 కోట్లు గ్రాస్ వచ్చింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’కు వచ్చిన కలెక్షన్లు చూస్తే..
కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా – రూ. 1.35 కోట్లు,
ఓవర్సీస్ – రూ. 2.25 కోట్లు
తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ కు ఈ కలెక్షన్స్ ను కూడా కలుపుకుంటే ఫస్ట్ వీక్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’కు రూ. 21.45 కోట్లు షేర్‌తో పాటు రూ. 35.70 కోట్లు గ్రాస్ వచ్చింది. కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టే. అందుకే.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’కు అఖిల్ కెరీర్ లో హిట్ గా నిలిచింది. కానీ చిత్రబృందం చెబుతున్నట్లు సూపర్ హిట్ అనే రేంజ్ అయితే కలెక్షన్లలో కనబడుట లేదు.