https://oktelugu.com/

Akhil Akkineni: అభిమానుల్లారా నన్ను క్షమించండి అంటూ అక్కినేని అఖిల్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఏజెంట్ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికి ఈ సందర్భంగా నేను కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను. మేమంతా ఒక మంచి సినిమాని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసాం , కానీ మా దురదృష్టం కొద్దీ ఈ చిత్రాన్ని మేము అనుకున్న విధంగా వెండితెర మీద ఆవిష్కరించలేకపోయాము.

Written By:
  • Vicky
  • , Updated On : May 15, 2023 / 06:28 PM IST

    Akhil Akkineni

    Follow us on

    Akhil Akkineni: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏజెంట్’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై అక్కినేని అభిమానులు మొదటి నుండి భారీ అంచనాలు పెట్టుకున్నారు. అఖిల్ ఇండస్ట్రీ కి స్టార్ హీరో అవుతాడు అనే రేంజ్ అంచనాల నడుమ వచ్చాడు. ఒక రేంజ్ లో కష్టపడే మనస్తత్వం ఉంది, కానీ అదే సమయం లో ఆయనకీ దురదృష్టం కూడా బోలెడంత ఉంది.

    అందుకే కెరీర్ లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఒక్క మంచి సినిమాకూడా ఆయనకీ పడలేదు. అందం , టాలెంట్ , డ్యాన్స్ మరియు ఫైట్స్ ఇలా స్టార్ హీరో అవ్వడానికి కావాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నప్పటికీ ఆయన ఇలా మిగిలిపోవడం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.కమర్షియల్ గా కనీసం 7 కోట్ల రూపాయిలు కూడా వసూలు చెయ్యని ఈ సినిమా గురించి నేడు అఖిల్ ట్విట్టర్ లో ఎమోషనల్ ఒక ట్వీట్ వేసాడు.

    ఆయన మాట్లాడుతూ ‘ ఏజెంట్ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికి ఈ సందర్భంగా నేను కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను. మేమంతా ఒక మంచి సినిమాని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసాం , కానీ మా దురదృష్టం కొద్దీ ఈ చిత్రాన్ని మేము అనుకున్న విధంగా వెండితెర మీద ఆవిష్కరించలేకపోయాము.ఇక ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర గారికి నేను కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను, ఆయనకీ నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ గా నిలుస్తూ వచ్చారు.ఇక ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి మరియు మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా కి కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను. అభిమానులు చూపించే ప్రేమ మరియు ఉత్సాహం వల్లే మేము సినిమాలు చేస్తున్నాం, కచ్చితంగా నేను మీ అందరి కోసం గ్రాండ్ కం బ్యాక్ ఇవ్వబోతున్నాను’ అంటూ అఖిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.