Akkada Ammayi Ikkada Abbayi : బుల్లితెరలో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన వారిలో ఒకరు ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju). ఇతని కామెడీ టైమింగ్ ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ముఖ్యంగా ఢీ షోలో సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer) తో కలిసి ఈయన చేసే కామెడీ ఎంత సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ మనకు బోర్ కొట్టినప్పుడు వీళ్ళకు సంబంధించిన ఫన్నీ వీడియోస్ ని యూట్యూబ్ లో చూస్తూ ఉంటాము. ఇదంతా పక్కన పెడితే ఆయన హీరో గా నటించిన రెండవ చిత్రం ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి'(Akkada Ammayi..Ikkada Abbayi) ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో ప్రదీప్ తో పాటు మూవీ టీం ఫుల్ బిజీ గా ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షోని ఇటీవలే ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులకు, మీడియా మిత్రులకు వేసి చూపించారు.
వీళ్ళ నుండి ఈ సినిమాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ చిత్రం లో కామెడీ టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అయ్యిందట. ప్రదీప్, సత్య, గెటప్ శ్రీను వంటి వారి మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పేలాయని థియేటర్స్ లో ఆడియన్స్ ఈ సన్నివేశాలకు పొట్టచెక్కలు అయ్యేలా నవ్వుకుంటారని తెలుస్తుంది. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా బోర్ కొట్టడట. ఏప్రిల్ 10 , 11 తేదీలలో చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. వీటి అన్నిట్లో ఈ చిత్రం ఆడియన్స్ ని, ట్రేడ్ ని షాకింగ్ కంటెంట్ తో సర్ప్రైజ్ చేస్తుందని, బాక్స్ ఆఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్ గా నిలుస్తుందని అంటున్నారు ప్రివ్యూ షో ని చూసిన వాళ్లంతా.
Also Read : ఊర్లో ఒకే ఒక్క అమ్మాయి..యాంకర్ ప్రదీప్ కొత్త మూవీ ట్రైలర్!
మరి ప్రివ్యూ షోలో వచ్చిన టాక్ నిజం అవుతుందా లేదా అనేది తెలియాలంటే ఎల్లుండి వరకు ఆగాల్సిందే. ఈ చిత్రం లో హీరోయిన్ గా దీపికా పిల్లి నటించింది. ఈమె ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షో లో ప్రదీప్, సుధీర్, హైపర్ ఆది, రష్మీ వంటి వారితో కలిసి కామెడీ స్కిట్స్ అప్పట్లో చేసేది. ఇన్ స్త్రగ్రం లో కూడా మంచి పాపులర్. ఇక ఈ చిత్రానికి నితిన్, భరత్ దర్శకత్వం వహించాడు. వీళ్ళు గతం యూట్యూబ్ లో ఎన్నో అద్భుతమైన షార్ట్ ఫిలిమ్స్ చేశారు. జబర్దస్త్ లో కూడా ఎన్నో స్కిట్స్ కి స్టోరీ రైటర్స్ గా వ్యవహరించారు. సోషల్ మీడియా ఆడియన్స్ కి డైరెక్టర్స్ గా వీళ్ళు సుపరిచితమే, మంచి కామెడీ టైమింగ్ కూడా వీరిలో ఉంది. సినిమా స్క్రిప్ట్ అంత అద్భుతంగా వచ్చింది కాబట్టే, ప్రదీప్ కొంతకాలం తన టీవీ షోస్ ని కూడా పక్కన పెట్టి ఈ షో చేశాడని అంటున్నారు.
Also Read : ఆర్థిక ఇబ్బందుల్లో యాంకర్ ప్రదీప్..లేటెస్ట్ కామెంట్స్ వైరల్!