Akkada Ammayi..Ikkada Abbayi : బుల్లితెర పై స్టార్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న ప్రదీప్(Pradeep Machiraju), ఇప్పుడు హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. మొదటి సినిమా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత ఆయన మళ్ళీ టీవీ షోస్ చేసుకున్నాడు. అలాగే కొనసాగుతాడు, మళ్ళీ సినిమాల్లోకి రాడు అని అందరు అనుకున్నారు కానీ, ఆయన మాత్రం టీవీ షోస్ కి బ్రేక్ ఇచ్చి మరీ ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి'(Akkada Ammayi..Ikkada Abbayi) చిత్రం చేసాడు. ఇటీవలే గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అసలు రాలేదు. కానీ రెండవ రోజు, మూడవ రోజు నుండి మాత్రం కలెక్షన్స్ బాగా పిక్ అయ్యింది. బుక్ మై షో లో ట్రెండింగ్ లోకి కూడా వచ్చింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం నాలుగు రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
Also Read : ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ మొట్టమొదటి రివ్యూ..ఆడియన్స్ కి పెద్ద సర్ప్రైజ్!
విడుదలకు ముందు ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 4 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. ఓపెనింగ్స్ చూసి మూవీ యూనిట్ తో పాటు, ట్రేడ్ కూడా చాలా భయపడింది. ఇదేంటి మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ మన సినిమాని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని మేకర్స్ భయపడిన విషయం వాస్తవమే, కానీ రెండవ రోజు నుండి పికప్ అవ్వడంతో కచ్చితంగా ఈ చిత్రానికి లాంగ్ రన్ ఉంటుందని, బ్రేక్ ఈవెన్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు. రెండవ రోజు ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 6 వేల టికెట్స్ అమ్ముడుపోగా, మూడవ రోజు 8 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఓవరాల్ గా మూడు రోజులకు కలిపి ఈ సినిమాకు కోటి 86 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వర్కింగ్ డే అయినటువంటి నిన్న కూడా ఈ చిత్రానికి 50 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చిందట.
దీంతో ఓవరాల్ గా ఈ చిత్రానికి రెండు కోట్ల 36 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, కోటి 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో మూడు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావాలి. ఇదే రేంజ్ స్టడీ రన్ ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తే మాత్రం కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. పెద్ద సినిమాల విడుదల దగ్గర్లో లేవు కాబట్టి, ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. మంచి సినిమా ని అందిస్తే ప్రేక్షకులు ఒక్క రోజు ఆలస్యం అయినా, కచ్చితంగా గుర్తించి ఆదరిస్తారు అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణగా నిలిచిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
Also Read : అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ మొదటి రోజు వసూళ్లు..ప్రదీప్ కి ఎదురుదెబ్బ!