Akkada Ammayi Ikkada Abbayi Collection: టీవీ యాంకర్ గా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందించిన ప్రదీప్(Pradeep Machiraju) ఇప్పుడు హీరో గా రెండవసారి ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి'(Akkada Ammayi..Ikkada Abbayi) చిత్రంతో పరీక్షించుకున్నాడు. నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ అయితే బాగానే వచ్చాయి కానీ, కలెక్షన్స్ మాత్రం రాలేదు. బుక్ మై షో లో ఇప్పటి వరకు ఈ చిత్రం ట్రెండింగ్ లోకి రాకపోవడం అంటే ఎంత దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయో మీరే ఊహించుకోండి. ప్రదీప్ సినిమా చేయడమే కాదు, ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడం లో కూడా ఆయన ఎంతో కష్టపడ్డాడు. టీవీ షోస్, యూట్యూబ్ చానెల్స్ అన్నిటిని వాడేసాడు. చివరికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ని కూడా ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగం చేశాడు. కానీ ఫలితం లేకుండా పోయింది.
Also Read: 2 రోజుల్లో 80 కోట్లు..చరిత్ర తిరగరాసిన అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’!
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి మొదటి రోజు కనీసం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదట. ఓవర్సీస్ లో అయితే అసలు ఈ చిత్రం విడుదల అయ్యిందో లేదో కూడా తెలియని పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చినట్టు తెలుస్తుంది. ప్రదీప్ మొదటి చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే చిత్రానికి దాదాపుగా 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఫుల్ రన్ లో వచ్చాయి. ఎందుకంటే ఆ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం’ అనే పాట అప్పట్లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఫలితంగా ఓపెనింగ్స్ అదిరిపోవడమే కాకుండా, మంచి లాంగ్ రన్ కూడా వచ్చింది. ఈ సినిమాకు అలా హైప్ ని క్రియేట్ చేసే పాట ఒక్కటి కూడా రాకపోవడమే ఈ సినిమాకి ఇలాంటి ఫలితం దక్కడానికి కారణం అయ్యిందని అంటున్నారు. ట్రైలర్ కూడా పర్వాలేదు అనిపించే రేంజ్ లోనే అనిపించింది.
ఈమధ్య కాలం లో స్టార్ హీరోల సినిమాలే ఆసక్తికరమైన ప్రొమోషన్స్ చేయకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయి ఫలితాలను సొంతం చేసుకోలేకపోతున్నాయి. ఇక ఇలాంటి చిన్న హీరోల సినిమాలను ఆడియన్స్ అసలు పట్టించుకోవడం లేదు. అదే వాళ్ళను ఆకర్షించే కంటెంట్ ని వదిలితే మాత్రం బ్రహ్మరథం పెట్టేస్తున్నారు. అందుకు ఉదాహరణ రీసెంట్ గా విడుదలైన ‘డ్రాగన్’ చిత్రం. ఈ సినిమా హీరో పేరు కూడా మనోళ్లకు తెలియదు, కానీ పెద్ద హిట్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ వెర్షన్స్ ని కలిపి 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కాబట్టి సినిమా బాగా తీస్తే సరిపోదు, ప్రొమోషన్స్ దగ్గర నుండే ఆకర్షితమైన కంటెంట్ ని ఇవ్వాలి. లేకపోతే ఆడియన్స్ పట్టించుకోరు అని అనడానికి ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ చిత్రం ఒక ఉదాహరణ గా నిల్చింది.