
Akira Nandan : హీరో కొడుకు కేవలం హీరోనే అవ్వాల్సిన అవసరం లేదు, అతనికి ఇష్టమైన క్రాఫ్ట్ ని ఎంచుకొని ముందుకెళ్లొచ్చు, అందులో గొప్పగా రాణించొచ్చు కూడా.కానీ ఇండస్ట్రీ లో అలా జరగడం లేదు, వారసత్వం ని ముందుకు కొనసాగించడం కోసం హీరోలు తమ వారసులను హీరోలుగానే ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్నారు.
కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని గతం లో ఇదే ప్రశ్న అడిగితే ఆయన చెప్పిన సమాధానం ‘ఇప్పుడు నేను హీరో ని అయ్యాను కదా అని నా కొడుకు కూడా హీరో అవ్వాలనుకోవడం కరెక్ట్ కాదు కదా, వాడికి నిజంగా ఆసక్తి ఉంటేనే అవ్వగలడు, మనం బలవంతంగా ముందుకు తోసెయ్యలేము.వాడు ఏమి అవ్వాలనుకుంటున్నాడో అదే అవుతాడు, మా బలవంతం ఉండదు’ అని చెప్పాడు.ఆయన చెప్పిన మాట ప్రకారమే అకిరా నందన్ సినీ రంగ ప్రవేశం ఉండబోతుంది.
అతని కటౌట్ మరియు అందం ని చూసి అందరూ ఆయన హీరో అవుతాడని సోషల్ మీడియా లో తెగ పోస్ట్స్ లు పెట్టేవాళ్ళు.కానీ అకిరా తల్లి రెండు దేశాయ్ మాత్రం ఉన్న వాస్తవమే చెప్పింది.అకిరా కి నటన మీద ఎలాంటి ఆసక్తి లేదని, అతనికి మ్యూజిక్ అంటే పిచ్చి అని, భవిష్యత్తులో మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడేమో అని చెప్పింది.ఆమె చెప్పినట్టుగానే అకిరా నందన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక షార్ట్ ఫిలిం ద్వారా పరిచయం అయ్యాడు.త్రివిక్రమ్ కొడుకు మనోజ్ రిషి హీరో గా, కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వం వైటర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిలిం ఈమధ్యనే విడుదల అయ్యింది.ఈ షార్ట్ ఫిలిం కి అకిరా నందన్ మ్యూజిక్ అందించాడు.అద్భుతమైన మ్యూజిక్ మరియు రీ రికార్డింగ్ తో అందరినీ ఆశ్చర్యపొయ్యేలా చేసాడు.
అకిరా లో ఈ టాలెంట్ ని గమనించిన రామ్ చరణ్, తానూ తియ్యబోతున్న సినిమాలలో కచ్చితంగా నువ్వు సంగీతం అందించాలి అని చెప్పాడట,దానికి అకిరా నందన్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.అంటే త్వరలోనే అకిరా నందన్ మొదటి సినిమా రామ్ చరణ్ తోనే ప్రారంభం కాబోతుంది అన్నమాట.మరి ఈయన సౌత్ లోనే టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడా లేదా అనేది చూడాలి