Prashanth Neel Akira Nandan movie: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులతో పాటు , సినీ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అకిరా నందన్(Akira Nandan) సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన అప్డేట్ ఈ ఏడాది లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం నటన లో శిక్షణ తీసుకుంటున్న అకిరా నందన్, త్వరలోనే పవర్ స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, అకిరా నందన్ మొదటి సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ అకిరా కోసం అనేక కథలను వింటూ ఉన్నారట. ఏది కూడా అనుకున్న స్థాయిలో లేకపోవడం గమనార్హం. దీంతో రీసెంట్ గానే ప్రశాంత్ నీల్ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి ఒక పవర్ ఫుల్ కథని వినిపించినట్టు తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ డ్రామా చిత్రమే, కానీ అకిరా వయస్సు కి తగ్గ పాత్ర అట. స్టోరీ లైన్ వినగానే పవన్ కళ్యాణ్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేయడం , రామ్ చరణ్ ని కూడా ఆ స్టోరీ ని వినమని సూచించడం జరిగిందట. అన్నీ అనుకున్నట్టు జరిగితే , ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున , అకిరా నందన్ మొదటి సినిమాకు సంబంధించిన అప్డేట్ ని అధికారికంగా ప్రకటిస్తారట. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే, అకిరా నందన్ మొదటి సినిమా తోనే పాన్ ఇండియన్ సూపర్ స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టేయొచ్చు. ఎందుకంటే టాలీవుడ్ లో ప్రభాస్ తర్వాత , అలాంటి కటౌట్ అకిరా నందన్ కి మాత్రమే ఉంది . ఆయన ఆఫ్ లైన్ లుక్స్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది.
ముఖ్యంగా అమ్మాయిల్లో అకిరా కి ఫాలోయింగ్ మామూలు రేంజ్ లో లేదు. ఆయన లుక్స్ కి తగ్గట్టుగా, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ చేతిలో పడడం మామూలు విషయం కాదు . వాస్తవానికి పవన్ కళ్యాణ్ అభిమానులు , తమ హీరోకి ఇలాంటి డైరెక్టర్స్ తగిలితే బాగుండును అని అనుకోని రోజంటూ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం , ఉప ముఖ్యమంత్రి అవ్వడం తో భారీ డైరెక్టర్స్ తో ఆయన సినిమాలు చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల కానిది , అకిరా నందన్ వల్ల అవుతుందని, భవిష్యత్తులో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని అకిరా నందన్ ఒక రేంజ్ లో శాసిస్తాడు అని పవన్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు.