Akhira Nandan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ల సత్తా ఏంటో చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక నందమూరి నటసింహంగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు సైతం ఈ ఏజ్ లో కూడా మంచి విజయాలను సాధిస్తూ యంగ్ హీరోలకు పోటీని ఇస్తున్నాడు…ఇక ఇలాంటి క్రమంలోనే తన కొడుకు అయిన మోక్షజ్ఞ కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి. అయినప్పటికి ఆయన ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. తొందర్లోనే ఆయన సినిమా రాబోతుందంటూ మరోసారి నందమూరి ఫ్యామిలీ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే చిరంజీవికి బాలయ్య బాబుకి ఒకప్పుడు ఎంత మంచి పోటీ ఉండేదో మనందరికి తెలిసిందే. ఇక వీళ్ళ తర్వాత ఈ జనరేషన్ లో నందమూరి నట వారసుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ కి, మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ కి మధ్య విపరీతమైన పోటీ ఉంది. ఇక వీళ్ళ తర్వాత జనరేషన్ లో బాలయ్య కొడుకు అయిన మోక్షజ్ఞ కి పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అఖిరా నందన్ కి మధ్య విపరీతమైన పోటీ ఉండబోతోంది.
వీరిద్దరూ ఒకేసారి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కాబట్టి వీళ్ల మధ్య మరోసారి నందమూరి వర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ కొనసాగబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక వీరిలో ఎవరు విజయం సాధిస్తారు ఎవరు టాప్ పొజిషన్ ని అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది… మొత్తానికైతే ఇద్దరు కూడా హీరో మెటీరియల్ లాగానే కనిపిస్తున్నారు.
కానీ ఇక్కడ ఎవరు తమ నట విశ్వరూపాన్ని చూపిస్తూ మంచి కథలను ఎంచుకొని ప్రేక్షకులను మెప్పిస్తారు అనేది తెలియాల్సి ఉంది… ఇక గత రెండు జనరేషన్స్ నుంచి మెగా ఫ్యామిలీ ఆధిపత్యమే కొనసాగుతోంది.బాలయ్య బాబు కి విపరీతమైన పోటీ ని ఇస్తు మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు తన సత్తాను చూపిస్తూ నెంబర్ వన్ పొజిషన్ ని తను తప్ప మరెవరు అందుకోలేరన్నంత రేంజ్ లో ముందుకు దూసుకువచ్చాడు.
ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ మధ్య పోటి సాగుతున్నప్పటికి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ ఒక అడుగు ముందు వరుసలో ఉన్నాడు… ఈ రెండు జనరేషన్లో తర్వాత వస్తున్న 3 వ జనరేషన్ లో మోక్షజ్ఞ – అఖిరానందన్ ఇద్దరిలో ఎవరు టాప్ పోజిషన్ చేరుకుంటారు? ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది…