Akhil Wife Wedding Saree: రీసెంట్ గానే అక్కినేని అఖిల్(Akkineni Akhil) పెళ్లి జైనబ్ అనే అమ్మాయితో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) చాలా సింపుల్ గా తన ఇంట్లోనే ఈ వివాహాన్ని జరిపించాడు. తనకు అత్యంత సన్నిహితులైన వారినే ఈ వివాహానికి ఆహ్వానించాడు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కుటుంబం తో పాటు మరికొందరు ఈ పెళ్లి వేడుకలో కనిపించారు. ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలే సోషల్ మీడియా అంతటా తిరుగుతున్నాయి. ఇదంతా బాగానే ఉంది కానీ, జైనబ్(Zainab Ravdjee) కి , ఆమె కుటుంబానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో లీకై అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. జైనబ్ తండ్రి ప్రముఖ పారిశ్రామిక వేత్త. ఈయన మాజీ సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడు అనే విషయం రీసెంట్ గానే తెలిసిందే. నాగార్జున కూడా జగన్ కి సన్నిహితుడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే.
మరో ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే అఖిల్, కి జైనబ్ కి మధ్య వయస్సు తేడా దాదాపుగా 8 ఏళ్ళు ఉంటాయట. అఖిల్ కి 31 ఏళ్ళ వయస్సు అయితే, జైనబ్ కి 39 ఏళ్ళ వయస్సు. అయితే సోషల్ మీడియా లో జైనబ్ కి సంబంధించిన ఒక వీడియో లీకై సంచలనం గా మారింది. అక్కినేని అభిమానులు అయితే ఈ వీడియో ని చూసి షాక్ కి గురయ్యారు. ఇక మిగిలిన నెటిజెన్స్ అయితే ఇదేమి పొయ్యేకాలం అండీ బాబోయ్ అంటూ జైనబ్ ని తిడుతున్నారు. ఎందుకంటే ఆమెకు చీర కట్టుకోవడం రాదు. ఆ చీర ని ఆమె అసిస్టెంట్ (పురుషుడు) కడుతున్నాడు. చీర కట్టుకోవడం ఈమధ్య కాలం లో అనేక మంది అమ్మాయిలకు చేత కాదు, జైనబ్ కూడా అందులో ఒకరు, ఇది పెద్ద విషయమే కాదు. కానీ ఆమె చీరను పర పురుషుడు కట్టడమే సంచలన టాపిక్ గా మారింది.
Also Read: Nagarjuna new daughter-in-law : కొత్త కోడలు ఇంటికి వస్తే, నాగార్జున మాత్రం ఏం చేస్తున్నారో చూడండి!
కడితే అక్కినేని అఖిల్ కట్టాలి, లేకుంటే ఆడవాళ్లు కట్టాలి. అంతే కానీ పర పురుషుడి చేత చీర కట్టించుకోవడం ఏమిటి అంటూ నెటిజెన్స్ దుర్భాషలు ఆడుతున్నారు. తన అసిస్టెంట్ తో చీర కట్టించుకున్న తర్వాత అఖిల్ వద్దకు ఫోటో షూట్ కి వెళ్ళింది. ఈ విషయం అఖిల్ కి నిజంగా తెలుసా?, తెలిసినప్పటికీ కూడా చూసి చూడనట్టు ఉన్నాడా?, లేదా ఈమధ్య కాలం లో ఇలాంటివి పట్టించుకోవద్దు అనే ఆలోచన లో ఉన్నాడా? అంటూ సోషల్ మీడియా లో అక్కినేని అభిమానులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున కేవలం జైనబ్ వెనుక ఉన్న ఆస్తిని చూసే తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసాడని, ఇది ఒక ఎమోషన్ తో జరిగిన పెళ్లి కాదని సోషల్ మీడియా లో ఈ వీడియో ని చూసిన నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనికి అఖిల్ రెస్పాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.
Bro wait .! pic.twitter.com/3InivJmTjc
— (@kaali02) June 11, 2025