https://oktelugu.com/

Akkineni Akhil: సినిమాలు మానేసి క్రికెట్ రంగం లోకి అడుగుపెట్టనున్న అఖిల్..?

అక్కినేని కుటుంబం నుండి ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసే హీరో అవుతాడని అందరూ అనుకుంటే, అఖిల్ కనీసం మీడియం రేంజ్ హీరోల స్థాయిలో కూడా హిట్టు కొట్టలేకున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : May 4, 2023 / 06:50 PM IST

    Akkineni Akhil

    Follow us on

    Akkineni Akhil: మొదటి సినిమా విడుదల కాకముందే రాబొయ్యే కాలం లో కాబొయ్యే సూపర్ స్టార్ అనిపించినా హీరో అక్కినేని అఖిల్. మనం చిత్రం క్లైమాక్స్ లో అతిథి గా ఆయన ఇచ్చిన ఎంట్రీ కి తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లాయి. భవిష్యత్తులో ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరో అవుతాడని అభిమానులతో పాటుగా ఆడియన్స్ కూడా అనుకున్నారు. కానీ అఖిల్ ఏ ముహూర్తం లో అడుగుపెట్టాడో తెలియదు కానీ, ఇప్పటి వరకు కనీసం కెరీర్ లో ఒక్క సూపర్ హిట్ ని కూడా అందుకోలేకపోయాడు.

    అక్కినేని కుటుంబం నుండి ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసే హీరో అవుతాడని అందరూ అనుకుంటే, అఖిల్ కనీసం మీడియం రేంజ్ హీరోల స్థాయిలో కూడా హిట్టు కొట్టలేకున్నాడు.ఇక రీసెంట్ గా విడుదలైన ‘ఏజెంట్’ చిత్రం కూడా భారీ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం అఖిల్ ని మానసికంగా ఎంతో కృంగిపోయేలా చేసింది.

    ఈ చిత్రం కోసం అఖిల్ తన రెండేళ్ల కెరీర్ ని ఇచ్చేసాడు, ఎంతో కష్టపడ్డాడు, కానీ ఆయన కష్టానికి తగిన ఫలితం రాకపోవడం దురదృష్టకరం. అభిమానులు అయితే అఖిల్ పై చాలా ఫైర్ మీద ఉన్నారు. చేస్తే మంచి సినిమాలు చెయ్యి, లేదంటే సినిమాలు మానేసి నీకు ఇష్టమైన క్రికెట్ లో జాయిన్ అయిపో అంటూ ట్విట్టర్ లో అఖిల్ ట్యాగ్ చేసి కామెంట్ చేస్తున్నారు. అఖిల్ కూడా తన తదుపరి సినిమా పట్ల ఎంతో జాగ్రత్తలు తీసుకొని చేస్తానని, ఒకవేళ ఈ చిత్రం కూడా ఫ్లాప్ అయితే నేను సినీ రంగాన్ని పూర్తిగా వదిలేసి క్రికెట్ లోకి వెళ్లిపోతానని ఆయన తల్లి అమలతో చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న వార్త.

    అఖిల్ మంచి బ్యాట్స్ మ్యాన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇది వరకు జరిగిన సినీ తారల క్రికెట్ మ్యాచ్ లో ఆయన ఏ రేంజ్ లో ఆడేవాడో మన అందరికీ తెలిసిందే. ఒకవేళ ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెడితే అక్కినేని ఫ్యాన్స్ గర్వం గా ఫీల్ అవుతారు.మరి అఖిల్ కెరీర్ రాబొయ్యే రోజుల్లో ఎటువైపు వెళ్లబోతుందో చూడాలి.