https://oktelugu.com/

Bigg Boss OTT: బింధుమాదవా? మజాకా.. ఏకంగా అఖిల్ ను తోసేసి..!

Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ యమ రంజుగా సాగుతోంది. మూడో వారం ఆసక్తికరమైన ఎలిమినేషన్ జరుగబోతోంది. ఈసారి ఏకంగా 12 మంది నామినేషన్స్ లో ఉండడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ 12 మందిలో మొదటి సారి నామినేషన్స్ లోకి వచ్చారు తేజస్వి, బింధుమాధవి, అజయ్,స్రవంతిలు.. ఫస్ట్ టైమ్ నామినేషన్స్ లోకి వచ్చారు. గత వారం ఓటింగ్ లో అఖిల్ టాప్ ప్లేసులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి హౌస్ లో దాదాపుగా ఎక్కువమంది […]

Written By:
  • NARESH
  • , Updated On : March 18, 2022 / 12:14 PM IST
    Follow us on

    Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ యమ రంజుగా సాగుతోంది. మూడో వారం ఆసక్తికరమైన ఎలిమినేషన్ జరుగబోతోంది. ఈసారి ఏకంగా 12 మంది నామినేషన్స్ లో ఉండడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ 12 మందిలో మొదటి సారి నామినేషన్స్ లోకి వచ్చారు తేజస్వి, బింధుమాధవి, అజయ్,స్రవంతిలు.. ఫస్ట్ టైమ్ నామినేషన్స్ లోకి వచ్చారు.

    గత వారం ఓటింగ్ లో అఖిల్ టాప్ ప్లేసులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి హౌస్ లో దాదాపుగా ఎక్కువమంది నామినేషన్స్ లో ఉండడం వల్ల ఎవరి ఓటింగ్ ఏంటి అనేది తేలనుంది. ఫస్ట్ రెండు వారాలు సాదాసీదాగా ఓటింగ్ జరిగినా మూడో వారం మాత్రం ఓటింగ్ గట్టిగా జరిగింది.

    అనధికార పోలింగ్ ప్రకారం.. బిగ్ బాస్ లవర్స్ హౌస్ లో అందరికంటే బాగా గేమ్ ఆడుతున్న బింధుమాధవికి ఈసారి అత్యధిక ఓట్లు పడుతున్నట్టు సమాచారం. ఏకంగా టాప్ ప్లేసులో ఉన్న అఖిల్ కు టఫ్ ఫైట్ ఇస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొదటి వారం నుంచి అఖిల్ కు టఫ్ ఫైట్ ఇస్తూ బింధుమాధవి అతడి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. అఖిల్ ను ఓవర్ టేక్ చేసి మరీ ముందుకు దూసుకుపోతోంది.

    బిందుమాధవి ఆటకు ఓటీటీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. గతవారం నాగార్జున సైతం ప్రశంసించడం విశేషం. బిందుమాధవి బాగా ఆడుతుందని నాగార్జున అనడంతో ఆమె ప్రత్యర్థిగా వ్యవహరిస్తున్న అఖిల్ మోము చిన్నబోయింది. ఇక తేజస్వి, నటరాజ్ మాస్టర్ సైతం బిందుమాధవిని టార్గెట్ చేస్తుండడంతో చాలా మంది అభిమానులు ఆమె ఆటతీరుకు ఫిదా అయ్యి అఖిల్ ను మించి బిందుమాధవికి ఓట్ల వర్షం కురిపిస్తున్నారు.

    అనధికార సైట్స్ లో కూడా బిందుమాధవి ఏకంగా అఖిల్ కంటే మొదటి స్థానంలోకి వచ్చేసింది. ఓటింగ్ పరంగా దూసుకుపోతోంది. ఏకంగా బింధుమాధవికి 28 శాతం వరకూ ఓటింగ్ వస్తే అఖిల్ కు 27శాతం వరకూ వస్తోంది.

    ఈ వారం డేంజర్ జోన్ లో ముగ్గురు కనిపిస్తున్నారు. నటరాజ్ మాస్టర్, అజయ్ , స్రవంతిలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయం. అజయ్, స్రవంతి వీరిద్దరే చివరి పొజిషన్ లో ఉన్నారు.