https://oktelugu.com/

Prabhas On Akhil: అఖిల్ పై రూ. 100 కోట్లు పెట్టుబడి పెడుతున్న ప్రభాస్… ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

2021లో విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించాడు. ఒక్క హిట్ పడగానే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేశాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ భారీ అంచనాల మధ్య విడుదలైంది.

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2023 / 02:58 PM IST

    Prabhas On Akhil

    Follow us on

    Prabhas On Akhil: అక్కినేని వారసుడు అఖిల్ పరిశ్రమకు వచ్చి దశాబ్దం కావస్తుంది. హీరోగా అఖిల్ మొదటి చిత్రం ‘అఖిల్’ 2015లో విడుదలైంది. ఎనిమిదేళ్లలో అరడజను సినిమాల వరకూ చేశాడు. ఒక హిట్ కూడా పడలేదు. భారీ బడ్జెట్ తో దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన అఖిల్ డిజాస్టర్ అయ్యింది. యాక్షన్ జోనర్స్ లాభం లేదని రొమాంటిక్ లవ్ జోనర్స్ ట్రై చేశాడు. హలో, మిస్టర్ మజ్ను సైతం నిరాశపరిచాయి. అఖిల్ కెరీర్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ హిట్ మూవీగా ఉంది.

    2021లో విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించాడు. ఒక్క హిట్ పడగానే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేశాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ భారీ అంచనాల మధ్య విడుదలైంది. సినిమా ఇష్టం వచ్చినట్లు తెరకెక్కించి విడుదల చేశారన్న విమర్శలు వినిపించాయి. అఖిల్ కెరీర్లో వరస్ట్ మూవీగా ఏజెంట్ నిలిచింది.

    అఖిల్ మార్కెట్ అంతకంతకూ తగ్గిపోతూ వస్తుంది. ఏజెంట్ మూవీ చూసి అభిమానులు కూడా విమర్శలు చేశారు. ఏజెంట్ విడుదలై ఆరు నెలలు అవుతున్నా అఖిల్ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. నెక్స్ట్ ఏం చేయాలనే సందిగ్ధంలో ఆయన ఉన్నారట. అయితే మరో భారీ ప్రాజెక్ట్ కి సైన్ చేశాడంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. కొత్త దర్శకుడు అనిల్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ బడ్జెట్ ఏకంగా రూ. 100 కోట్లు అంటున్నారు.

    ప్రభాస్ హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించనుందట. ప్రభాస్ ట్రాక్ సరిగాలేదు. కనీస మార్కెట్ లేదు. ఈ పరిస్థితుల్లో అఖిల్ మీద వంద కోట్ల పెట్టుబడి అంటే రిస్క్ అని చెప్పాలి. అయితే కంటెంట్ మీద నమ్మకంతో ముందుకు వెళుతున్నారట. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డిటైల్స్ అధికారికంగా త్వరలో ప్రకటిస్తారట. ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.