Akhil Akkineni: ప్లాప్ డైరెక్టర్ తో అఖిల్ సినిమా… నాగార్జున ఏంటి ఇలా చేస్తున్నాడు…

నాగార్జున తరువాత తన కొడుకులు అయిన నాగ చైతన్య, అఖిల్ లు ఇద్దరు ఇండస్ట్రీ కి వచ్చారు...అయితే నాగచైతన్యకు అడపదడప హిట్లు వస్తున్నాయి. కానీ నాగ్ చిన్న కొడుకు అయిన అఖిల్ కి మాత్రం ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు కావస్తున్న కూడా ఇంతవరకు ఒక్కటి కూడా సరైన సక్సెస్ దక్కలేదు.

Written By: Gopi, Updated On : December 23, 2023 9:57 am

Akhil Akkineni

Follow us on

Akhil Akkineni: అక్కినేని ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీ లో గత 50 సంవత్సరాల నుంచి మంచి ట్రాక్ రికార్డు ఉంది. నాగేశ్వరరావు నుంచి మొదలైన వీళ్ళ సినిమా ప్రస్థానం ఈ తరం నాగ చైతన్య , అఖిల్ దాకా సాగుతూ వచ్చింది. ఇక మొదట నాగేశ్వరరావు తను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా ఆయన తరువాత నాగార్జున హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక తనదైన రీతిలో నాగార్జున మంచి సక్సెస్ లు అందుకుంటూ మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఆ తరం హీరోల్లో టాప్ ఫోర్ హీరోల్లో తను కూడా ఒకడిగా నిలవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ప్రస్తుతం నాగార్జున కొన్ని కమర్షియల్ సినిమాలను చేస్తూ తన బిజీలో తన ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక నాగార్జున తరువాత తన కొడుకులు అయిన నాగ చైతన్య, అఖిల్ లు ఇద్దరు ఇండస్ట్రీ కి వచ్చారు…అయితే నాగచైతన్యకు అడపదడప హిట్లు వస్తున్నాయి. కానీ నాగ్ చిన్న కొడుకు అయిన అఖిల్ కి మాత్రం ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు కావస్తున్న కూడా ఇంతవరకు ఒక్కటి కూడా సరైన సక్సెస్ దక్కలేదు. ఇక ఆయన ఫెయిల్యూర్ కి కారణం ఆయన స్టోరీ సెలక్షన్ లోనే చాలా మిస్టేక్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

అందుకే నాగార్జున ఈసారి చాలామంది డైరెక్టర్లతో సంప్రదించి మంచి సినిమాలు చేసి అఖిల్ ని సక్సెస్ ఫుల్ హీరోగా మార్కెట్లోకి వదలాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా నాగార్జున ఇలానే అనుకొని భారీ అంచనాలు పెట్టుకొని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చేయించిన ఏజెంట్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీంతో అటు సురేందర్ రెడ్డి కెరియర్, ఇటు అఖిల్ కెరియర్ ఇద్దరి కెరియర్లు కూడా డైలమాలో పడ్డాయి.

ఇక ఇప్పుడు దానికి ఏమాత్రం తీసిపోకుండా నాగార్జున ఒక తమిళ్ డైరెక్టర్ ని అఖిల్ సినిమా కోసం ప్రిఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఎవరు అంటే తెలుగులో రీసెంట్ గా రామ్ తో వారియర్ అనే సినిమా చేసిన లింగు స్వామి…అవును లింగుస్వామి ఇప్పుడు అఖిల్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు గా తెలుస్తుంది. ఇక లింగుస్వామి ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు అయినప్పటికీ అతను చెప్పిన కథ నాగార్జునకి బాగా నచ్చడంతో ఆయన డైరెక్షన్ లోనే అఖిల్ సినిమా చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

నాగార్జున తన కెరీర్ గురించి కూడా అంతా ఇబ్బంది పడడం లేదు కానీ తన కొడుకు అయిన అఖిల్ కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు కనక అఖిల్ కి హిట్ రాకపోతే మాత్రం అతని సినిమా కెరియర్ కంప్లీట్ గా క్లోజ్ అవుతుంది. తను ఒక ఫెయిల్యూర్ హీరోగా మిగిలిపోతారు అందుకే ఆ భయాన్ని దృష్టి లో పెట్టుకొని నాగార్జున తన మీద ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…మరి ప్లాపుల్లో ఉన్న లింగుస్వామి అఖిల్ కి ఏ మేరకు హిట్ ఇస్తాడో చూడాలి…