Lenin release postponed : అక్కినేని అఖిల్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘లెనిన్’. సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్య దేవర నాగవంశీ, అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జున సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రమిది. ముందుగా ఈ సినిమాని మే 1 న విడుదల చేద్దామని అనుకున్నారు, కానీ ‘పెద్ది’ చిత్రం కోసం జూన్ 25 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఈ చిత్రం ఆ తేదీన కూడా రావడం లేదట. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా బ్యాలన్స్ ఉండడం వల్లే అట. ఈ విషయాన్ని స్వయంగా అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ ఖాతా ద్వారా చెప్పుకొచ్చాడు. కొత్త విడుదల తేదీ జులై 10 అని కూడా చెప్పుకొచ్చారు. కానీ జూన్ 25 న ఈ సినిమా విడుదల అవుతుందని భారీ ఆశలు పెట్టుకున్న అక్కినేని ఫ్యాన్స్ మాత్రం , వాయిదా పడింది అనే వార్త విని చాలా బాధపడ్డారు.
విడుదల వాయిదా పై అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘లెనిన్ టీం ఈ చిత్రాన్ని వాయిదా వెయ్యాలని నన్ను రిక్వెస్ట్ చేశారు. కారణాలు ఏంటి అని అడగ్గా, కాస్త సమయం ఇస్తే, నూటికి నూరు శాతం అద్భుతమైన ఔట్పుట్ , అక్కినేని ఫ్యాన్స్ చిరస్థాయిగా గుతుంచుకునే విధమైన థియేట్రికల్ అనుభూతి ఇచ్చేలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తామని అన్నారు. సినిమా మీద వాళ్లకు ఉన్న ప్రేమ, కమిట్మెంట్ నన్ను ఈ చిత్రాన్ని వాయిదా వేయడానికి ఒప్పించేలా చేశాయి. మనోడు ఇప్పుడు జులై 10 న రాబోతున్నాడు. మళ్లీ మళ్లీ చెప్తున్నాను , సరికొత్త అఖిల్ ని మీరంతా చూడబోతున్నారు. లెనిన్ ని అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఈ చిత్రానికి మురళి కృష్ణ అబ్బూరు దర్శకత్వం వహించాడు. ఆయనకు ఇదే మొదటి సినిమా. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ , అక్కినేని ఫ్యాన్స్ ని మాత్రమే కాదు , సాధారణ మూవీ లవర్స్ ని కూడా ప్రత్యేకంగా ఆకర్షించింది. అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అనే నమ్మకాన్ని ఇచ్చింది. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే నటించింది. నటనకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇది. ముందుగా ఈ పాత్ర కోసం శ్రీలీల ని ఎంచుకొని కొంతవరకు షూటింగ్ చేశారు. కానీ ఆమె మధ్యలో తప్పుకోవడం తో భాగ్యశ్రీ ని తీసుకున్నారు మేకర్స్. ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం అవుతున్న వార్త ఏమిటంటే , ఈ చిత్రంలో అఖిల్ గుడ్డివాడిగా నటించాడని , ఇదే కనుక నిజమైతే , ఆయన నట విశ్వరూపాన్ని మనం ఆశించవచ్చు. చూడాలి మరి ఈ సినిమాతో అయినా అఖిల్ హిట్ కొడతాడా లేదా అనేది.

