Akkineni Akhil: సినీ ఇండస్ట్రీ లో హీరోల మధ్య ఈగోలు వేరే లెవెల్ లో ఉంటాయని అంతా అనుకుంటూ ఉంటారు. అది నిజమే, ఇంతమంచి స్నేహితులైన , బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రం ఎంతో కొంత ఈగో ఉంటుంది. కానీ ఎలాంటి ఈగోలు లేకుండా ఇండస్ట్రీ లో సొంత అన్నదమ్ములు లాగా దశాబ్దాల నుండి కొనసాగిన హీరోలు ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున పేర్లు ఉంటాయి. వీళ్లిద్దరు ఒకే జనరేషన్ కి చెందిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్. అయినప్పటికీ కూడా వీళ్ళ మధ్య ఎలాంటి ఈగోలు లేవు, ఎన్నో సందర్భాల్లో చిరంజీవి గురించి నాగార్జున ఎంతో గొప్పగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, అదే విధంగా చిరంజీవి కూడా అదే రేంజ్ లో నాగార్జున కోసం నిలబడిన సందర్భాలు ఉన్నాయి. అంత గొప్ప స్నేహం వీళ్ళిద్దరిది.
Also Read: అక్కా.. కేసులు వెనక్కి తీసుకో.. పాపం రేవంత్ రెడ్డిది మామూలు బాధ కాదు పో..
ఇదే తరహా స్నేహం వీళ్ళ కుటుంబాల్లో మూడవ తరం హీరోలకు ఉంటుందో లేదో అని మొదట్లో అంతా అనుకున్నారు. కానీ చిరంజీవి, నాగార్జున ఎంత స్నేహంగా ఉండేవారో , అంతకు మించిన స్నేహంతో, సొంత అన్నదమ్ములు లాగా ఉంటూ వస్తున్నారు అక్కినేని అఖిల్, రామ్ చరణ్. ఎన్నో సందర్భాల్లో వీళ్లిద్దరు ఒకరికోసం ఒకరు నిలబడ్డారు. ఇకపోతే ‘పెద్ది’ చిత్రం మార్చి 27 న విడుదల కాబోతుంది అని గతం లో మేకర్స్ ప్రకటించగా, అఖిల్ ‘లెనిన్’ చిత్రాన్ని మే 1న విడుదల చేయబోతున్నట్టు ఆ చిత్ర మేకర్స్ ప్రకటించారు. కానీ ‘పెద్ది’ షూటింగ్ ఇంకా కాస్త బ్యాలన్స్ ఉండడం తో ఏప్రిల్ 30 కి వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పుడు ‘లెనిని’ చిత్రాన్ని మరోసారి వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఆ సినిమా నిర్మాతలు కాసేపటి క్రితమే విడుదల చేసిన ఒక ప్రెస్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆ ప్రెస్ నోట్ లో ఏముందంటే ‘మా లెనిన్ చిత్రాన్ని ముందుగా మే 1 న విడుదల చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాము. కానీ ఇప్పుడు వాయిదా వేస్తున్నాం. కారణం మన ప్రియమైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30 న విడుదల కాబోతుంది. మేము కూడా ఆ చిత్రాన్ని మీ అందరి లాగానే పాజిటివ్ వాతావరణం లో సెలెబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాము. రామ్ చరణ్, అఖిల్ మధ్య ఎంతో గొప్ప సాన్నిహిత్యం ఉందో మన అందరికీ తెలుసు. వాళ్ళ మధ్య ఉన్న బంధానికి విలువ ఇచ్చే మేము ఈ సినిమాని వాయిదా వెయ్యాలని అనుకుంటున్నాము. మేము మీ అందరికీ మాట ఇచ్చినట్టుగానే లెనిన్ చిత్రం అభిమానులకు ఒక గొప్ప సెలబ్రేషన్ లాగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు.
#LENIN will now arrive on June 26th, 2026. ❤️#LeninOnJune26th @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @musicthaman @KishoreAbburu @NavinNooli @artkolla @leonbrittodp @pramodactor1 @brindhagopal1 @AnnapurnaStdios #ManamEnterprisesLLP @SitharaEnts @tseriessouth pic.twitter.com/EB9Y6c30Ip
— Annapurna Studios (@AnnapurnaStdios) March 28, 2026