Akhil Akkineni : అక్కినేని నట వారసుడిగా, భారీ అంచనాల నడుమ అక్కినేని అఖిల్(Akkineni Akhil) గ్రాండ్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దాదాపుగా పదేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు ఆయన కెరీర్ ఒక్కటంటే ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేకపోవడం గమనించాల్సిన విషయం. కచ్చితంగా అఖిల్ ని స్టార్ హీరోల లీగ్ లోకి తీసుకెళ్తుంది అనే అంచనాలతో విడుదలైన ‘ఏజెంట్’ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అంతకు ముందు సినిమాలు ఆడిన, ఆడకపోయినా అక్కినేని అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు, ఈ సినిమా కాకపోతే మరో సినిమాతో సూపర్ హిట్ కొడుతాడు అనే నమ్మకం తో ఉండేవారు. కానీ ‘ఏజెంట్’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పట్లో అఖిల్ కోలుకోగలడా?,, అసలు అక్కినేని పరిస్థితి ఏమిటి?, ది గ్రేట్ ANR లేజసీ నాగార్జున తోనే ముగిసిపోవాలా? అనే భయం లోకి వెళ్లిపోయారు.
Also Read : ఎన్టీయార్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ ముగ్గురిలో హీరో అఖిల్ కి ఆ స్టార్ హీరో డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట..?
ఈ సినిమా తర్వాత అఖిల్ కూడా వెంటనే మరో ప్రాజెక్ట్ ని ఒప్పుకోలేదు. ఈసారి కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలి, సూపర్ హిట్ కొట్టిన తర్వాత అభిమానుల ముందుకు వచ్చి నా ముఖాన్ని చూపిస్తాను అంటూ శపథం చేసినట్టు నాగార్జున(Akkineni Nagarjuna) ఒక ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. అలాంటి ప్రాజెక్ట్ కోసం చాలా కాలం వరకు ఎదురు చూసి, ఎట్టకేలకు మంచి స్క్రిప్ట్ రెడీ అయ్యాక ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూద్దాము. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రం గుర్తుందా?, వరుస ఫ్లాప్స్ లో ఉన్న కిరణ్ కి ఈ సినిమా సూపర్ హిట్ గా నిల్చింది. ఈ చిత్రం ద్వారా నందు అనే కొత్త టాలెంటెడ్ డైరెక్టర్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఆయనే ఇప్పుడు అఖిల్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రం పూర్తిగా చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందట.
వాస్తవానికి ఈ సినిమా కథ ప్రముఖ నిర్మాత సాహు గారపాటి వద్ద ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న నాగార్జున ఆ కథ నాకు కావాలని పట్టుబట్టి, అతను కోరినంత డబ్బులిచ్చి కథని కొనుకున్నాడట. పూర్తిగా చిత్తూరు స్లాంగ్ లో గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా అట ఇది. ఇలాంటి నేపథ్యం ఉన్న సినిమాలు మా అక్కినేని ఫ్యామిలీ కి బాగా వర్కౌట్ అవుతాయని నాగార్జున బలంగా నమ్మి, ఈ సినిమాని స్వయంగా ఆయన నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నాడు. గతంలో నాగార్జున నిర్మాతగా అఖిల్ హీరో గా ‘హలో’ అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ నెల 14 నుండి చిత్తూరు జిల్లాలోని భారతం మెట్ట అనే కొండప్రాంతం లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.