Akhanda: దీపావళికి బాలయ్య బరిలో దిగబోతున్నాడు. నిజానికి దసరా బరిలోనే బాలయ్య అఖండ రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ లేట్ అవ్వడం, ఏపీలో టికెట్ రేట్లు పై లెక్కలు తేలకపోవడం, మొత్తానికి ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుంది కాబట్టే.. నటసింహం సైలెంట్ గా దీపావళికి షిఫ్ట్ అయిపోయాడు. నవంబర్ 4వ తేదీన తన అఖండ విడుదలకు సిద్ధం అయ్యాడు.

ఇక మంగళవారంతో ‘అఖండ’ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్ర బృందం అధికారికంగా తెలిపింది. ఈ క్రమంలో తమ సినిమా విడుదల తేదీ త్వరలోనే ప్రకటిస్తామని టీమ్ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం అఖండ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బాలయ్య బాబు ఈ సినిమాలో రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి మెప్పించబోతున్నాడు.
పైగా బాలయ్య బాబు – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి చేస్తోన్న మూడో సినిమా ఇది. వీరి కలయికలో సింహా, లెజెండ్ లాంటి బారీ హిట్స్ రావడం, ఇప్పుడు ముచ్చటగా హ్యాట్రిక్ కోసం వీరిద్దరూ కలిసి మరో ప్రయత్నం చేస్తుండటంతో…. మొదటి నుండి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఆ అంచనాలకు కారణం మాత్రం అఖండ సినిమా టీజర్ నే. 70 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించి బాలయ్య అభిమానూలు చాల సంవత్సరాలు తరువాత తల ఎత్తుకుని సగర్వంగా తమ అభిమాన హీరో సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది అఖండ సినిమా టీజర్.
ఒక విధంగా వ్యూస్ పరంగా బాలయ్య కెరీర్ లోనే కొత్త రికార్డ్స్ ను సృష్టించింది. అందుకే, ఈ సినిమా శాటిలైట్ డీల్ కోసం భారీ మొత్తం ఇవ్వడానికి ఛానల్స్ పోటీ పడ్డాయి. అలాగే డిజిటల్ రైట్స్ కి కూడా బాగా డిమాండ్ పెరిగింది. భారీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడంతో సినిమాకి ఓ రేంజ్ క్రేజ్ క్రియేట్ అయింది.