https://oktelugu.com/

Akhanda: ఇండియన్​ ఆర్మీని కాదనుకుని.. ‘అఖండ’లో విలన్​గా?

Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ.. డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. థియేటర్​కి వచ్చిన ప్రతి ఒక్కరికీ పూనకాలు తెప్పిస్తోంది. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని చోట్లా భారీ రికార్డులతో దూసుకెళ్లిపోతోంది. ఓవర్సీస్​లోనూ అఖండ జోరు మాములుగా లేదు. విడుదలైన రెండ్రోజుల్లోనే 50కోట్ల షేర్​ను రాబట్టినట్లు సమాచారం. అమెరికాలో అయితే, ప్రీమియర్ షో కలెక్షన్స్​తోనే రికార్డులు బద్దలు కొట్టింది. బోయపాటి డైరెక్షన్ ఒకెత్తైతే.. థమన్ మ్యూజిక్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 5, 2021 / 12:55 PM IST
    Follow us on

    Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ.. డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. థియేటర్​కి వచ్చిన ప్రతి ఒక్కరికీ పూనకాలు తెప్పిస్తోంది. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని చోట్లా భారీ రికార్డులతో దూసుకెళ్లిపోతోంది. ఓవర్సీస్​లోనూ అఖండ జోరు మాములుగా లేదు. విడుదలైన రెండ్రోజుల్లోనే 50కోట్ల షేర్​ను రాబట్టినట్లు సమాచారం. అమెరికాలో అయితే, ప్రీమియర్ షో కలెక్షన్స్​తోనే రికార్డులు బద్దలు కొట్టింది.

    బోయపాటి డైరెక్షన్ ఒకెత్తైతే.. థమన్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్​లో కూర్చోబెట్టాయి. అయితే, బోయపాటి సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. విలన్​ కూడా అంతే బలంగా కనిపించేలా చేస్తాడు.. అలా ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్​గా శ్రీకాంత్​తో పాటు నితిన్ మెహతా కూడా నటించారు. స్వామీజీ గెటప్​లో క్రూరమైన పనులు చేసే క్యారెక్టర్ చేసింది అతనే. అయితే అతనెవరో తెలుసా?

    నితిమ్ మెహతా ఒక ఆర్మీ ఆఫీసర్​.. 21 సంవత్సరాల పాటు ఇండియన్​ ఆర్మీలో సేవలు అందించారు. ఆ తర్వాత ఓ ప్రొఫెషనల్ మోడల్​గా, నటుడిగా మారాలని కలలు కని.. యూనిఫామ్​ను తీసేసి.. సినిమావైపు అడుగులేశారు. అలా బాలీవుడ్​లో కాబిల్​, భూమి వంటి సినమాలో ఛాన్స్ దక్కంచుకున్నారు. సౌత్​లోనూ రెండు, మూడు సినిమాల్లో నటించారు. కానీ, అఖండ సినిమా మాత్రం ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం హాట్​ టాపిక్​గా మారారు నితిన్ మెహతా. ఈ క్రమంలోనే వరుసగా మరిన్ని విలన్ పాత్రలు రానున్నట్లు తెలుస్తోంది.